'దేవర' షూటింగ్ వీడియో లీక్
X
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్‌లో బిజీబిజీ ఉన్నాడు. డైరెక్టర్ కొరటాల శివ పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. సమ్మర్లో సందడి చేయాల్సిన ఈ మూవీ దసరాకి ఫిష్ట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయ్యారు. అయితే తాజాగా దేవర మూవీకి సంబంధించిన ఓ చిన్న క్లిప్ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ థ్రిల్ అవుతున్నారు.
ప్రస్తుతం గోవాలో దేవర టీమ్ సందడి చేస్తోంది. ఆ సెట్ నుంచి ఎన్టీఆర్ షూటింగ్ వీడియో లీకైంది. దూరం నుంచి ఎవరో ఫోన్‌లో ఎన్టీఆర్ వీడియోను రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది. బ్లాక్ షర్ట్, లుంగీలో కనిపిస్తున్న తారక్...అలా నడుచుకుంటూ బీచ్‌లో వెళ్తున్నారు. అది చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సూపర్‌గా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ వీడియో లీకులపై దేవర టీమ్ ఫైర్ అవుతోంది. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ఇందులో విలన్‌గా చేస్తున్నారు. ఇందులో తారక్ డబుల్ రోల్‌లో కనిపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అక్టోబర్ 10న దేవర థియేటర్లలో సందడి చేయనుంది.
All Hail The Tigerrrr 🐯🔥#Devara pic.twitter.com/6YRisONLNQ
— I'm a Fan Of NBK (@Chaitanya9045) March 21, 2024