'అది నా పిల్ల'.. దేవరకొండ బ్రదర్స్ పోస్ట్ వైరల్
X
విజయ్ దేవరకొండ ,సమంత జోడీగా నటించిన యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ‘ఖుషి’ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతోంది. శివ నిర్వాణ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, సాంగ్స్ సినీ ప్రియులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ప్రస్తుతం మూవీ యూనిట్ చిత్ర ప్రమోషన్లతో బిజీ బిజీ ఉంటోంది. సమంత అమెరికాలో ఖుషీగా ఖుషీ సినిమా ప్రమోషన్స్ చేస్తోంది. ఇటు విజయ్ దేవరకొండ లోకల్‌గా సినిమాకు హైప్‌ను తీసుకువస్తున్నాడు.సోషల్ మీడియాలోనూ తనదైన స్టైల్లో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా విజయ్ ఖుషిలోని తన డైలాగ్‌ను ఉద్దేశిస్తూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్‌కు తమ్ముడు ఆనంద్ రిప్లై ఇచ్చాడు. దీంతో దేవరకొండ బ్రదర్స్ నెట్టింట్లో సందడి చేశారు. ఇంతకీ ఈ బ్రదర్స్ ఇద్దరూ ప్రత్యేకంగా నెట్టింట్లో ఏ సీన్స్ గురించి మాట్లాడుకున్నారంటే...
విజయ్ ప్రస్తుతం 'ఖుషి' ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఈ మూవీపైన నెటిజన్లు సరదాగా మీమ్స్, ఇంట్రెస్టింగ్ వీడియోలను క్రియేట్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. తాజాగా అదే వేదికపైన విజయ్ ఈ మీమ్స్‌కు తనదైన స్టైల్లో స్పందించాడు. ఓ నెటిజన్ 'ఖుషి'లో విజయ్ చెప్పే 'అది నా పిల్ల' డైలాగ్‌ను. 'బేబీ' లోని ఓ సన్నివేశంలో 'అది నా పిల్లరా' అంటూ ఆనంద్ ఎమోషనల్‌గా ఫీల్ అయ్యే సీన్‌ను యాడ్ చేశాడు. "ఆకలేసిన వాడు ఒకరకంగా అంటాడు.. ఎదురుదెబ్బ తగిలినవాడు ఒకరకంగా అంటాడు" అని 'కింగ్' సినిమాలో కామెడీ స్టార్ బ్రహ్మానందం చెప్పే ఫన్నీ డైలాగ్‌ను ఈ సీన్స్‌లో మిక్స్ చేసి సరదా వీడియో చేశాడు. ఈ వీడియోకు విజయ్ రిప్లై ఇస్తూ.. "అది నా పిల్ల.. ఇదొక ఎమోషన్" అని నవ్వించారు. ఆనంద్ స్పందిస్తూ.. "ట్విటర్ అప్పుడప్పుడూ ఇలాంటి రత్నాలను బయటికి తీస్తుంది" అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
SariPoyaru Iddaru 🤣pic.twitter.com/hti1OEWSSn
— ︎ ︎ (@swaroop7_) August 26, 2023