Home > సినిమా > దేవర.. 2024లోనే లేదు

దేవర.. 2024లోనే లేదు

దేవర.. 2024లోనే లేదు
X

కొన్ని కథలు ఎప్పటికీ ఎండ్ కావు. లేదంటే ఎప్పుడు ఎండ్ అవుతాయనేది అంత సులువుగా చెప్పలేరు. ప్రస్తుతం దేవరకు సంబంధించిన ఇష్యూ కూడా అదే. ఈసినిమాకు వేసుకున్న ప్లానింగ్ సూపర్బ్ అనిపించుకున్నారు. షూటింగ్ కూడా చాలా వేగంగా సాగింది. కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ను కూడా క్యాన్సిల్ చేసుకుని మరీ దేవరకు టైమ్ ఇచ్చాడు ఎన్టీఆర్. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ వల్ల చివరి నిమిషంలో లేట్ కాకూడదని ఆ పార్ట్ ఎక్కువగా ఉండే యాక్షన్ సీక్వెన్స్ లను ముందుగానే చిత్రీకరించారు. ఇక టాకీ, సాంగ్స్ మాత్రమే బ్యాలన్స్ కదా అనుకునే టైమ్ సడెన్ గా దేవర వాయిదా అంటూ వార్తలు. ఇవి నిజం కాదు అని మూవీ టీమ్ నుంచి ఎవరూ చెప్పలేదు. ఏప్రిల్ నుంచి ఆగస్ట్ కు పోస్ట్ పోన్ అయిందంటున్నారు. బట్ లేటెస్ట్ న్యూస్ వింటే అసలు దేవర ఈ యేడాది విడుదలే కావడం లేదట.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్ తో మొదలుపెట్టిన సినిమా దేవర. అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే ఈ పాటికి సినిమా షూటింగ్ అయిపోయి ఉండాల్సింది. బట్ అతను ఎంత డెడికేటెడ్ గా ఉన్నా.. ఇతర అంశాలన్నీ ఇబ్బంది పెట్టినట్టున్నాయి. అందుకే దేవర ఊహించని విధంగా లేట్ అయింది. దీంతో ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన సినిమా పోస్ట్ పోన్ అయింది. పైగా మధ్యలో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా చేస్తాం అని చెప్పడం కూడా ఇందుకు మరో కారణం అంటున్నారు. దీనికి తోడు అనిరుధ్ సరైన టైమ్ కు ట్యూన్స్ ఇవ్వలేదు. అటు విలన్ గా నటిస్తోన్న సైఫ్అలీఖాన్ కు సర్జరీ అయింది. నిజానికి ఇవేమంత పెద్ద ఇష్యూస్ కాదు. కానీ అవుట్ పుట్ పై ప్రభావం పడకూడదు అనే వాయిదా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఏప్రిల్ 5 లేకపోయినా ఆగస్ట్ 15న విడుదలవుతుంది అనే టాక్స్ వచ్చాయి. ఆ డేట్ కు అల్లు అర్జున్, సుకుమార్ పుష్ప2 ఉంది. సో.. వీరి మధ్య వార్ తప్పదు అనుకున్నారు. లేదా పుష్ప 2 కూడా పోస్ట్ పోన్ అవుతుందనుకున్నారు. బట్ లేటెస్ట్ గా అల్లు అర్జున్ ఎట్టి పరిస్థితిల్లోనూ వాయిదా వేయడానికి లేదు.. అని ఇంకా డెడికేటెడ్ గా వర్క్ చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ మేరకు మొత్తం టీమ్ కూడా అలెర్ట్ అయింది. సో.. అయితే దేవర వర్సెస్ పుష్ప 2 అవుతుందా అనుకుంటున్నవారికే ఈ క్లారిటీ. ఆగస్ట్ లోనే కాదు. అసలు ఈ యేడాదే దేవర రావడం లేదట. ది బెస్ట్ అవుట్ పుట్ తో వచ్చే యేడాది సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు అని కొత్తగా వినిపిస్తోంది. నిజంగా వీళ్లు.. 2025 సంక్రాంతి అని డేట్ ఇప్పుడే వేస్తే డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ లో సమస్యలు మొదలవుతాయి. అందుకే వీలైనంత వరకూ నాన్చుతూ వెళతారు. కానీ ఆ డేట్ కే వస్తాం అని అందరికీ ముందే చెప్పి ఉంచుతారు. దీనివల్ల ఈ యేడాదిలాగా రిలీజ్ టైమ్ కు ఇష్యూస్ ఉండవు. సో.. ఆల్రెడీ 2025 సంక్రాంతికి చిరంజీవి విశ్వంభర ఉంది. దానికి దేవర కూడా తోడవుతుందా లేక ఇంకేదైనా కొత్త డేట్ చెబుతారా అనేది చూడాలి.

Updated : 30 Jan 2024 10:43 AM GMT
Tags:    
Next Story
Share it
Top