ధర్మేంద్ర, 87, షబానా 72.. ముసలోళ్ల లిప్‌లాక్ కిస్సుపై రచ్చరచ్చ
X
ప్రేమకు వయసుతో సంబంధం లేదంటారు. అయినా యువతీయువకుల ప్రేమలు మాత్రమే ఆకట్టుకోవడం రివాజు. పండు ముసలివాళ్లు కూడా రొమాన్స్ చేసుకోవచ్చుగాని చూడటానికి విడ్డూరంగా ఉండడం తప్ప చెప్పుకోవడానికి విశేషమేమీ ఉండదు. ‘ముసలోడికి దసరా పండగ’ సామెతలా ఉంటుంది. అయితే ముసలి ముప్పులోనూ రొమాన్స్ అవసరమేనంటున్నాడు ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత ధర్మేంద్ర. 87 ఏళ్ల ఊతకర్ర వయసులో ఆయన లిప్ లాక్ చేసి రచ్చకు తెరలేపాడు. సహనటి అయిన 72 ఏళ్ల షబానా ఆజ్మీతో కలసి ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’ మూవీలో నటించిన ధర్మేంద్ర ఆమెతో ఓ సన్నివేశంలో పెదాలు పెనవేశారు. ముసలోళ్ల ఘాటు కిస్ అంటూ కొందరు ట్రోలింగ్ చేస్తున్నారు. ‘‘ఇంత వయసులో మంచి సినిమాలు చేయొచ్చు కదా. ఇలా ముద్దులుపెట్టుకుని సభ్య సమాజానికి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?’’ అని ప్రశ్నిస్తున్నారు.
అయితే అధర చుంబనాన్ని ధర్మేంద్ర గట్టిగా సమర్థించుకున్నాడు. వృద్ధులకు కూడా కోరికలు, ముద్దుముచ్చట్లు అవసరమేనన్నాడు. ‘‘చాలామందికి మా ముద్దుల సన్నివేశం నచ్చింది. చప్పట్టు కొట్టారు. మేం ఇలా చేస్తామని ఎవరూ ఊహించి ఉండరు. ముద్దు సీన్ ఉంటుందని దర్శకుడు కరణ్ జోహార్ మాకు ముందు చెప్పాడు. సినిమాకు అది అవసరం అనుకున్నారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. వయసు అనే కేవలం అంకెలు మాత్రమే. ఏ వయసు వాళ్ల ప్రేమయినా ముద్దుతో వ్యక్తమవుతుంది. మేం ఎలాంటి ఇబ్బందిపడకుండానే ముద్దు పెట్టుకున్నాం’’ అని చెప్పుకొచ్చాడు. రణ్‌వీర్ సింగ్, ఆలియా భట్ హీరోహీయిన్లుగా నటించిన ఈ చిత్రం ‘రాఖీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ’లో .. నటించారు. ఈ చిత్రం జూలై 28న రిలీజైంది.