Home > సినిమా > Anirudh Ravichander : ఆ సీరియల్ మ్యూజిక్‏ను అనిరుధ్ కాపీ చేశాడా ?

Anirudh Ravichander : ఆ సీరియల్ మ్యూజిక్‏ను అనిరుధ్ కాపీ చేశాడా ?

Anirudh Ravichander  : ఆ సీరియల్ మ్యూజిక్‏ను అనిరుధ్ కాపీ చేశాడా ?
X

కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతులైన సంగీత దర్శకుల్లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఒకరు. ఇటీవల విడుదలైన జైలర్, జవాన్ సినిమాల హిట్‎తో ఫుల్ ఫామ్‎లో ఉన్నాడు అనిరుధ్. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నాడు. అనిరుధ్ మ్యూజిక్ అందించిన లియో చిత్రం త్వరలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ మూవీ అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో అనిరుధ్ కు సంబంధించిన ఓ న్యూస్ ననెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అనిరుధ్ లియో కోసం ఓ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‎ను ప్రముఖ తెలుగు సీరియల్ నుంచి కాపీ కొట్టాడని సోషల్ మీడియాలో నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.





తెలుగు చిత్ర పరిశ్రమలో అద్భుతమైన, వైవిధ్యమైన సంగీతాన్ని అందిస్తూ దూసుకుపోతున్నాడు అనిరుధ్ . చిన్నవయసులోనే సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్‎గా పేరు సంపాదించుకున్నాడు. అందుకే స్టార్ హీరోల సినిమా వస్తుందంటే చాలు అందులో అనిరుధ్ మ్యూజిక్ ఉండాల్సిందే అన్నట్లుగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అనిరుధ్‎కి సంబంధించిన ఓ ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. లోకేష్ కనకరాజ్ డైరెక్షన్‎లో స్టార్ హీరో విజయ్ నటించిన ‘లియో’ మూవీ లిరిక్ వీడియో ఈవెంట్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు జరుగనుంది. ఈ మూవీకి అనురుధ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న విషయం తెలిసిందే. అయితే ఈ లిరిక్‌కు సంబంధించి ఓ వీడియోను లియో మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే టెలివిజన్‎లో ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న ‘మొగలిరేకులు’ సీరియల్ నుంచి అనిరుధ్ ఈ ట్యూన్ కాపీ కొట్టాడన్న రూమర్ నెట్టింట్లో వినిపిస్తోంది. లియోకు అందించిన బ్యాక్ గ్రౌండ్ సోర్స్ అచ్చం మొగలిరేకులు సీరియల్ లో పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడు తన వాహనంలో వెళ్తున్నప్పుడు ఇలాంటి ట్యూన్‎నే అందించారు. అదే మ్యూజిక్‎ను అనిరుధ్ ఈ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌గా వాడుకున్నాడు అంటూ నెటిజన్స్ అనిరుధ్‌‎ని ట్రోల్ చేస్తున్నారు.మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో ఫుల్ ట్రాక్ విడుదల అయితే కానీ తెలియదు.






Updated : 29 Sept 2023 2:44 PM IST
Tags:    
Next Story
Share it
Top