Vijay Devarakonda : విజయ్ దేవరకొండతో పొలిటికల్ డ్రామా
X
విజయ్ దేవరకొండ సినిమా అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉంది. కాకపోతే కొన్నాళ్లుగా వరుసగా డిజాస్టర్స్ చూస్తున్నాడు. చివరగా వచ్చిన ఖుషీ కొంత వరకూ ఫర్వాలేదనిపించుకుంది తప్ప.. బ్లాక్ బస్టరేం కాదు. అయినా వరుస ఆఫర్స్ తో దూసుకుపోతున్నాడు విజయ్. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో పరశురామ్ డైరెక్షన్ లో ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీని 2024 సంక్రాంతికి విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. తర్వాత గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సితార బ్యానర్ లో మరో సినిమా ఉంది. ఇది విజయ్ ఇప్పటి వరకూ చేయని జానర్ లో రూపొందబోతోన్న సినిమా అని సమాచారం.
గౌతమ్ సినిమా తర్వాత మళ్లీ తన బ్యానర్ లోనే విజయ్ మరో సినిమా చేసేలా అగ్రిమెంట్ చేసుకున్నాడు దిల్ రాజు. అందుకే విజయ్ దేవరకొండకు ఇతర పెద్ద బ్యానర్స్ నుంచి సినిమాలు వస్తున్నా.. ముందు తన ప్రాజెక్ట్ నే చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. ఇందులో భాగంగా గతంలో రాజావారు రాణివారు అనే సినిమాతో ఆకట్టుకున్న రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడు. 2024లోనే సెట్స్ పైకి వెళ్లబోతోన్న ఈ మూవీలో పొలిటికల్ టచ్ తో కూడిన పాయింట్ ఉంటుందట. అది కరెంట్ పాలిటిక్స్ పై కొంత సెటైరికల్ గానూ ఉంటుందని టాక్. అయితే ఏ రాష్ట్ర రాజకీయాలపై సెటైరిక్ గా ఉంటుందనేది తెలియాల్సి ఉంది. మొత్తంగా విజయ్ తో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ప్లాన్ చేసుకున్న దిల్ రాజు ముందు ఫ్యామిలీ స్టార్ పై ఎక్కువ ఫోకస్ చేశాడు.