Dil Raju : ఈగల్ మూవీ సోలో రిలీజ్.. దిల్ రాజు ఏమన్నారంటే..?
X
రవితేజ ఈగల్ సినిమాను ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయ్యేలా చూస్తామని దిల్ రాజు తెలిపారు. సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నప్పుడు ఈగల్కు సోలో రిలీజ్ ఉండేలా చూస్తామన్నామని.. కానీ ఫిబ్రవరి 9న మరో రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయని చెప్పారు. ఈగల్తో పాటు యాత్ర 2, లాల్ సలామ్ అదే రోజు విడుదలవుతున్నట్లు వివరించారు. తమ సినిమాతో పాటు మరో రెండు సినిమాల రిలీజ్ అవుతుండడంపై ఈగల్ సినిమా నిర్మాత పాజిటివ్గా స్పందించడం హర్షించదగ్గ విషయమన్నారు.
అదేవిధంగా ఫిబ్రవరి 9న రిలీజ్ కావాల్సిన సందీప్ కిషన్ భైరవ కోన ఫిబ్రవరి 16కు వాయిదా పడిందని దిల్ రాజు తెలిపారు. తమ వినతితో ఫిబ్రవరి 16కు రిలీజ్ డేట్ మార్చుకున్న నిర్మాత అనిల్ సుంకరకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మరో 6 నెలలు మాత్రమే తాను తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా ఉంటానని చెప్పారు. వచ్చే సంక్రాంతి వరకు కొత్త ప్రెసిడెంట్ వస్తారని చెప్పారు. వచ్చే సంక్రాంతి రిలీజ్ల గురించి కొత్త అధ్యక్షుడిని అడగాలని సూచించారు.
సీఎం రేవంత్తో భేటీ
సీఎం రేవంత్ రెడ్డిని టాలీవుడ్ నిర్మాతలు కలిశారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్, తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహా గిల్డ్ ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సమస్యలపై చర్చించారు. సినీ ఇండస్ట్రీ సమస్యలపై సీఎం సానుకూలంగా స్పందించారని దిల్ రాజు చెప్పారు. సమస్యల పరిష్కారాలను తీసుకుని రావాలని చెప్పారని.. ఈసీ మీటింట్ లో దీనిపై చర్చించి .. మళ్లీ సీఎంని కలుస్తామని వివరించారు.