Hero Ashish Reddy : జైపూర్ ప్యాలెస్లో ఘనంగా అనుపమ హీరో పెళ్లి...హైలెట్ గా నిలిచిన దిల్ రాజు
X
రౌడీ బాయ్స్ ఫేమ్ హీరో ఆశిష్ రెడ్డి ఓ ఇంటివాడైయ్యాడు. ప్రముఖ ప్రోడ్యూసర్ దిల్రాజు(Dil Raju) తమ్ముడి కొడుకు, హీరో ఆశిష్ రెడ్డి(Ashish Reddy), అద్వైత రెడ్డి(Advaitha Reddy)ల వివాహం జైపూర్ ప్యాలెస్ లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకలో బంధువులు, సన్నిహితులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు హాజరై వధూవరులిద్దరిని ఆశీర్వదించారు. ఇక కొడుకు పెళ్లిలో దిల్ రాజు చేసిన డాన్స్ హైలెట్ గా అయ్యింది. డ్రమ్స్ వాయిస్తూ, డ్యాన్స్ వేస్తూ సరదాగా స్టెప్పులు వేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల వచ్చిన రౌడీ బాయ్స్ సినిమాతో ఆశీష్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. మ్యూజికల్ హిట్ గా నిలిచిన ఈ సినిమా.. కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు. ప్రస్తుతం సెల్ఫిష్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఆశిష్.