Home > సినిమా > తెలంగాణ ప్రభుత్వంపై డింపుల్ హయాతి మరో ఆసక్తికర పోస్ట్..

తెలంగాణ ప్రభుత్వంపై డింపుల్ హయాతి మరో ఆసక్తికర పోస్ట్..

తెలంగాణ ప్రభుత్వంపై డింపుల్ హయాతి మరో ఆసక్తికర పోస్ట్..
X

టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతి ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. కొన్ని రోజులు కిందట డిసీపీ రాహుల్ హెగ్డే కారును ఢీ కొట్టి నానా హడావుడి చేసిన ఈ ముద్దుగుమ్ము ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్‌పై ఓ ట్వీట్ చేసింది. " ఇంటికి వెళ్లాలంటే గంటల సమయం పడుతుంది. ఎమర్జెన్సీ అయితే పరిస్థితి ఏంటీ? ట్రాఫిక్ డీసీపీ ఎక్కడ? అసలు హైదరాబాద్‎లో కాలు బయట పెట్టగలమా? ప్రభుత్వ ప్రతినిధులారా మాకు పెట్రోల్ ఉచితంగా రావడం లేదు, అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను మంత్రి కేటీఆర్, తెలంగాణా సీఎంఓ అధికారిక ట్విట్టర్ అకౌంట్స్‌కు హయాతి జోడించింది.





తాజాగా మరోసారి తెలంగాన సర్కార్‌ను టార్గెట్ చేస్తూ డింపుల్ హయాతి చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. కుక్కలను బంధించి తీసుకెళ్తున్న వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ తెలంగాణలో ఇలాగే జరుగుతుంది... ఎవరైనా ఆపండి అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం డింపుల్ మయాతి పోస్ట్ వైరల్‌గా మారింది. తరచూ సోషల్ మీడియాలో తెలంగాణ ప్రభుత్వంపై ఆమె విమర్శలు చేయడానికి గల కారణాలేంటో ఎవరికీ అంతపట్టడం లేదు.





గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ చిత్రంలో ఐటెమ్ సాంగ్‌తో డింపుల్ హయాతి వెలుగులోకి వచ్చింది. తర్వాత ర‌వితేజ హీరోగా న‌టించిన ఖిలాడి సినిమాలో నటించి మెప్పించింది.

రీసెంట్‌గా వ‌చ్చిన రామబాణం సినిమాలో ఆమె నటించారు.

Updated : 17 Aug 2023 2:04 PM IST
Tags:    
Next Story
Share it
Top