Home > సినిమా > బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. క్రేజీ కాంబినేషన్ రిపీట్

బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. క్రేజీ కాంబినేషన్ రిపీట్

బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్.. క్రేజీ కాంబినేషన్ రిపీట్
X

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా అగ్రహీరో నందమూరి బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ కాంబినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పకర్లేదు. వీరిద్దరి కలయికలో వచ్చిన 5 సినిమాల్లో 4 సూపర్ డూపర్ హిట్స్. అందులో ‘సమర సింహా రెడ్డి’, నరసింహా నాయుడు’ సినిమాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి. తాజాగా వీరి కాంబినేషన్ లో మరో పవర్‌ఫుల్ మూవీ రానుందని దర్శకుడు బి.గోపాల్ స్వయంగా తెలిపారు.





గురువారం తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసిన దర్శకుడు బి.గోపాల్.. కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శ్రీవారి ఆశీస్సులతో గతంలో ఎన్నడు లేనివిధంగా స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాలకృష్ణ సినిమాలలో బిజీగా ఉన్నందున ఆయనకు నచ్చే విధంగా కథను తయారు చేస్తున్నామని దర్శకుడు తెలిపారు. కథ ఫైనల్ అయిన తర్వాత షూటింగ్ మొదలు పెడతామని వెల్లడించారు. అయితే ఈ సినిమా కొంత ఆలస్యంగా మొదలవుతుందని చెప్పారు. బి. గోపాల్ తో పాటు సంగీత దర్శకుడు కోటి కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.





ఇక బాలయ్య, బి.గోపాల్ సినిమాల విషయానికొస్తే.. తొలిసారి బి.గోపాల్ డైరెక్షన్ లో బాలయ్య ‘లారీ డ్రైవర్’ తో బాక్సాపీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత వచ్చిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తమిళంలో, హిందీలో డబ్ చేస్తే అక్కడా కూడా సంచలనాలు క్రియేట్ చేసింది. 30 యేళ్ల క్రితమే ఈ సినిమా రూ. 10 కోట్లకు పైగా షేర్ సాధించి సంచలనం రేపింది. మూడో సినిమాగా వచ్చిన ‘సమరసింహా రెడ్డి’ తెలుగులో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను క్రాస్ చేసింది. అంతేకాదు తెలుగులో ఫ్యాక్షన్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అంతేకాదు ఈ సినిమా ఫుల్ రన్‌లో రూ. 20 కోట్ల వరకు షేర్ రాబట్టింది. తెలుగులో తొలి రూ. 20 కోట్ల షేర్ సాధించిన మూవీగా రికార్డులకు ఎక్కింది.

నాలుగో సినిమా ‘నరసింహనాయుడు’ కూడా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా రూ. 9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా రూ. 30 కోట్లకు పైగా షేర్ సాధించింది. తెలుగులో తొలి 30 కోట్ల షేర్ సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. బాలకృష్ణ, బి.గోపాల్ కలయికలో వచ్చిన ఐదో చిత్రం ‘పలనాటి బ్రహ్మనాయుడు’. ఈ చిత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది.



Updated : 4 Aug 2023 10:37 AM IST
Tags:    
Next Story
Share it
Top