Home > సినిమా > స్లమ్ డాగ్ హస్బెండ్ హిట్ కొట్టడం పక్కా

స్లమ్ డాగ్ హస్బెండ్ హిట్ కొట్టడం పక్కా

స్లమ్ డాగ్ హస్బెండ్ హిట్ కొట్టడం పక్కా
X

బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు, ప్రణవి జంటగా నటించిన చిత్రం 'స్లమ్ డాగ్ హస్బెండ్'. ఏఆర్ శ్రీధర్ దర్శకత్వంలో అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమా, ఈ నెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో శ్రీలీల చీఫ్ గెస్టుగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదు - పార్కు హయత్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు బాబీ, బుచ్చిబాబు, కార్తీక్ వర్మ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.

కెరియర్ తొలినాళ్లలో నన్ను సపోర్ట్ చేసిన వ్యక్తి బ్రహ్మాజీ, అలీ డైరెక్టర్ బాబీ అన్నారు. బ్రహ్మాజీ తనయుడు హీరోగా చేసిన స్లమ్ డాగ్ హస్బెండ్ మూవీ హిట్ కొట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. సర్దార్ గబ్బర్ సింగ్ లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసిన ప్రణవి ఈ సినిమాతో హీరోయిన్గా పరిచయమవడం ఆనందంగా ఉందని అన్నారు. పవన్ కల్యాణ్ లాగే నిర్మాత అప్పిరెడ్డికి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదని బాబీ అన్నారు. కంటెంట్ నమ్మి సినిమాలు తీసే అప్పిరెడ్డి కొత్త యాక్టర్లు, డైరెక్టర్లకు సపోర్ట్ చేయాలని కోరారు.


గుడ్ హస్బెండ్, బ్యాడ్ హస్బెండ్ గురించి చూశామని, స్లమ్ డాగ్ హస్బెండ్ ఎలా ఉంటాడో చూడాలని డైరెక్టర్ బుచ్చిబాబు అన్నారు. ఇలాంటి ఆలోచన రావడం అరుదన్న ఆయన.. మూవీ పక్కా హిట్ కావాలని ఆకాంక్షించారు. ఈ సినిమాలో తెలుగు అమ్మాయి హీరోయిన్ గా చేయడం ఆనందంగా ఉంది. తెలుగు అమ్మాయి దొరికిన దర్శకుడు అదృష్టవంతులని అన్నారు. నా నెక్స్ట్ మూవీ కోసం తెలుగు అమ్మాయినే తీసుకుకోవాలని చూస్తున్నాను బుచ్చిబాబు అని అన్నారు.


కొత్త డైరెక్టర్లకు మైక్ మూవీస్ మంచి స్టేజ్ అని బ్రహ్మాజీ అన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంటుకి ఒక స్టార్ గెస్టుగా కావాలని అనుకున్నానని శ్రీలీలను అడిగితే తాను చేసింది రెండు సినిమాలే సార్ .. నేను చీఫ్ గెస్టు ఏంటి బాగుండదేమో అన్నారని బ్రహ్మాజీ గుర్తు చేశారు. ఆమెకి ఉన్న క్రేజ్ గురించి చెబితే అప్పుడు ఒప్పుకుందని, అందుకు ఆమెకి థ్యాంక్స్ చెప్పారు. కాన్సెప్ట్ సినిమాలు తీస్తూ తన కొడుకుకు ఛాన్స్ ఇచ్చిన నిర్మాత అప్పిరెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు. ఇలాగే సినిమాలు తీస్తూ కొత్త హీరో, డైరెక్టర్లకు అవకాశమివ్వాలని బ్రహ్మాజీ కోరారు.



Updated : 28 July 2023 8:40 AM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top