హరీశ్ శంకర్ మంచి మనసుకు హ్యాట్సాఫ్
X
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ హారీశ్ శంకర్ గబ్బర్‌సింగ్‌తో సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు పవర్ స్టార్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో వస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే హరీశ్ శంకర్ తనకు సంబంధించి ఏ విషయమైనా స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా చెప్పేస్తుంటాడు. అలాంటి హరీశ్ శంకర్ తాజాగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున కారు తోస్తూ కనిపించారు.
నడిరోడ్డుపై ఆగిపోయిన ఓ వ్యక్తి కారును డైరెక్టర్ హరీశ్ శంకర్, ఉప్పెన డైరెక్టర్ సనా బుచ్చిబాబు కొంత దూరం పాటు చేతులతో నెట్టుకుంటూ వెళ్లారు. అటుగా వెళ్తున్న కొందరు వారిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది. హరీశ్, బుచ్చిబాబులు చేసిన సాయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. స్టార్ డైరెక్టర్లైనా వారి సింప్లిసిటీని చూసి ప్రశంసలు కురిపిస్తున్నారు.
Director #HarishShankar @harish2you sir and @MythriOfficial Ravi gaaru are helping the vehicle which is stopped on road 👏👏👏
— Mahaa Max (@mahaamaxx) March 14, 2024
Kudos to you sir 🙏🙏 @harish2you it’s a great beginning of my day sir after watching this one 👏👏👏 pic.twitter.com/CbGfCiU7AN