Home > సినిమా > Director Krish : డ్రగ్స్ కేసు విచారణకు హాజరైన డైరెక్టర్ క్రిష్..సాంపిల్స్ తీసుకున్న పోలీసులు

Director Krish : డ్రగ్స్ కేసు విచారణకు హాజరైన డైరెక్టర్ క్రిష్..సాంపిల్స్ తీసుకున్న పోలీసులు

Director Krish : డ్రగ్స్ కేసు విచారణకు హాజరైన డైరెక్టర్ క్రిష్..సాంపిల్స్ తీసుకున్న పోలీసులు
X

గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న డైరెక్టర్​ క్రిష్‌ నిన్న విచారణకు హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు విచారించిన పోలీసులు ఆయన సాంపిల్స్ తీసుకొని పంపించినట్లు తెలుస్తోంది. క్రిష్ బ్లడ్, యూరిన్ సాంపిల్స్ ను పోలీసులు ల్యాబ్ కు పంపించారు. అయితే యూరిన్ టెస్ట్ లో నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇంకా బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ తెలియాల్సి ఉంది. ఇవాళ సాయంత్రానికి రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. డ్రగ్ టెస్టులో నెగటివ్ రిపోర్ట్ వచ్చినా...సాక్షి కింద మరోసారి ఆయనను విచారణకు పిలవనున్నట్లు సమాచారం.

అయితే డ్రగ్స్‌‌ కేసులో తనను అరెస్ట్ చేయకుండా..ముందస్తు బెయిల్‌‌‌‌ మంజూరు చేయాలని ఇప్పటికే క్రిష్‌ హైకోర్టులో పిటిషన్‌‌‌‌ వేశారు. ఆయన పిటిషన్ పై కోర్టు మార్చి 4న విచారణ చేపట్టనుంది. డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ప్రధాన నిందితుడు వివేకానంద వాంగ్మూలం మేరకు.. పోలీసులు క్రిష్‌‌‌‌ పేరును ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌లో చేర్చారు. ఈ డ్రగ్స్ కేసులో మొత్తం 12 మంది పేర్లను FIRలో చేర్చారు. ఇప్పటికే డ్రగ్ సప్లేయర్ అబ్బాస్, డ్రగ్ పెడ్లర్ వహీద్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణకు హాజరుకాని వారికి నోటీసులు జారీ చేశారు.



Updated : 2 March 2024 11:59 AM IST
Tags:    
Next Story
Share it
Top