Home > సినిమా > Manikandan: దర్శకుడి ఇంట్లో చోరీ.. అది నేషనల్ అవార్డు అని తెలిసి..

Manikandan: దర్శకుడి ఇంట్లో చోరీ.. అది నేషనల్ అవార్డు అని తెలిసి..

Manikandan: దర్శకుడి ఇంట్లో చోరీ.. అది నేషనల్ అవార్డు అని తెలిసి..
X

ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు మణికందన్ (Director Manikandan) ఇంట్లో గత వారం దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. మధురై జిల్లాలోని స్వగ్రామమైన ఉసిలంపట్టిలో ఈ నెల 8 వ తేదిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంట్లో చొరబడి రూ.లక్ష నగదు, 5 సవర్ల బంగారు నగలు, అవార్డులు సైతం ఎత్తుకెళ్లారు. దర్శకుడి ఇంటి తాళాన్ని పగలగొట్టి బీరువాలో ఉన్న రూ.లక్ష నగదు, ఐదు సవర్ల బంగారు నగలు చోరీ చేశారు. అంతేకాకుండా జాతీయ అవార్డులకు సంబంధించిన రజత పతకాలను కూడా దొంగలు ఎత్తుకెళ్లారు. దర్శకుడు పోలీసు కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు ప్రారంభించారు.





మణికందన్‌ ఇంట్లో జరిగిన విషయం సోషల్ మీడియాలో బాగా వైరలైంది. ముఖ్యంగా ఆయన దర్శకత్వం వహించిన ‘కాకా మొట్టై’ సినిమాకు వచ్చిన నేషనల్ అవార్డు కూడా దొంగలు చోరీ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వార్త వైరల్ కావడంతో, దొంగలు ముందు జాగ్రత్త పడ్డారు. మణికందన్‌కు చెందిన విలువైన వస్తువును తిరిగి ఇచ్చారు. అలాగే క్షమించమంటూ ఓ లెటర్ కూడా రాశారు. మంగళవారం దర్శకుడి ఇంటి బయట ఓ ప్లాస్టిక్‌ కవర్ కనిపించింది. ఆ కవర్ లో జాతీయ అవార్డుతో పాటు క్షమించమని కోరుతూ ఓ లెటర్ పెట్టేసి వెళ్లారు. ఆ లెటర్‌లో.. ‘దయచేసి మమ్మల్ని క్షమించండి, మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీ ఒక్కరికే దక్కుతుంది’ అంటూ రాశారు.





ప్రముఖ తమిళ చిత్ర దర్శకుల్లో ఎం మణికందన్ ఒకరు. ధనుష్ గతంలో నిర్మించిన ‘కాకా మొట్టై’ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది. మణికందన్ దర్శకత్వం వహించిన ‘కడైసి వ్యవసాయా’ చిత్రం 2022 లో విడుదలైంది మరియు ఈ చిత్రంలో విజయ్ సేతుపతి నటించారు. ఈ మూవీకి పలువురి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు కూడా జాతీయ అవార్డు కూడా వచ్చింది. మణికందన్ స్వస్థలం మదురై జిల్లా ఉసిలంపట్టి గ్రామం. సినిమా షూటింగులు లేనప్పుడు మణికందన్ ఇక్కడే ఉంటాడు. సినిమా పని మీద చెన్నై వచ్చినప్పుడు అతని డ్రైవర్ ఇంటిని చూసుకుంటాడు. మణికందన్ చెన్నైకి వచ్చినప్పుడు ఉసిలంపాటి గ్రామంలోని అతని ఇంట్లో చోరీ జరిగింది.








Updated : 14 Feb 2024 3:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top