Home > సినిమా > ప్రతొక్కడూ బయోపిక్ తీయమంటున్నాడు... యాత్ర డైరెక్టర్ గుస్సా

ప్రతొక్కడూ బయోపిక్ తీయమంటున్నాడు... యాత్ర డైరెక్టర్ గుస్సా

ప్రతొక్కడూ బయోపిక్ తీయమంటున్నాడు... యాత్ర డైరెక్టర్ గుస్సా
X

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాన్ని ‘యాత్ర’ పేరుతో వెండితెరకు ఎక్కించి మంచి మార్కులు సంపాదించిన దర్శకుడు మహి వి రాఘవ్‌కు వరసబెట్టి ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఒకే మూస సినిమాలు తీయడానికి ఆయన ఇష్టపడడం లేదు. వైఎస్ జగన్ బయోపిక్ ‘యాత్ర 2’ పూర్తయ్యాక తన ఇక అలాంటి చిత్రాలు చేయనని స్పష్టం చేశారు. శనివారం వైఎస్ జయంతి సందర్భంగా ‘యాత్ర 2’ పోస్టర్‌ను విడుదల చేసిన తర్వాత ఆయన విలేకర్లతో మాట్లారు. 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో జగన్ పాదయాత్రను, ఆయన సీఎం అయ్యాక చేసిన పనులను చూపిస్తానని మహి చెప్పాడు. ఈ సందర్భంలో ఓ విలేకరి మాట్లాడుతూ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’ చేస్తున్నారు కదా, ఆయన బయోపిక్‌ను కూడా తీస్తారా అని అడిగారు. ఈ ప్రశ్నకు మహి సమాధానం దాటవేశారు. తన మూస చిత్రాలను తీయన్నారు.

‘‘ఇకపై రాజకీయ నేల బయోపిక్‌లు తీయను. ప్రతి ఒక్కడూ తన బయోపిక్ తీసి పెట్టమంటున్నాడు. రూ. 500 కోట్లు సంపాదించినోళ్లు ఎవరెవరో తమపైన సినిమా తీయమంటున్నాడు. నేనా పని చేయలేను’’ అని అన్నారు. కాగా యాత్ర 2లో జగన్‌గా తమిళ నటుడు జీవా, రాజశేఖర్ రెడ్డిగా నాగార్జున నటిస్తారని జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ, ఇప్పుడేమీ చెప్పనని, తర్వాలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. 2019లో మమ్ముట్టి హీరోగా వచ్చిన ‘యాత్ర’ మూవీ జగన్ గెలుపుకు కొంత చేయూత అందించింది. యాత్ర 2 ను కూడా మళ్లీ అధికారంలోకి రావడానికి పనికొస్తుందని వైకాపా ఆశలు పెట్టుకుంది.

Updated : 8 July 2023 10:52 PM IST
Tags:    
Next Story
Share it
Top