Home > సినిమా > రానా నాయుడు’కి బాబులా ‘సైతాన్’.. మరీ ఇంత ఘోరమా...!

రానా నాయుడు’కి బాబులా ‘సైతాన్’.. మరీ ఇంత ఘోరమా...!

రానా నాయుడు’కి బాబులా ‘సైతాన్’.. మరీ ఇంత ఘోరమా...!
X

ఆనందో బ్రహ్మ, యాత్ర సినిమాలతో ఫేమ్ సంపాధించుకున్న డైరెక్టర్ మహి వి. రాఘవ్.. సేవ్‌ ద టైగర్స్‌ వెబ్‌ సిరీస్‌ తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చాడు. తొలి సిరీస్‌తోనే మంచి మార్కులు తెచ్చుకున్న రాఘవ్.. ఇప్పుడు మరో వెబ్ సిరీస్ ‘సైతాన్’తో ప్రేక్షకుల మందుకు రాబోతున్నాడు. అయితే, ఈసారి కామెడీ కాకుండా.. క్రైమ్ జానర్ ని ఎంచుకున్నాడు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. టైలర్ ప్రారంభంలోనే సింగిల్ గా చూడమని హింట్ ఇచ్చాడు దర్శకుడు. ఎందుకంటే.. బోల్డ్ కంటెంట్, బూతు డైలాగ్స్ తో ఒళ్ళు గగుర్పొడిచేలా ఉన్న ఈ ట్రైలర్ లో.. ఒక్కో సీన్ ఒక్కో షాట్ నెక్స్ట్ లెవల్లో ఉన్నాయి.

పక్కా పొలిటికల్ అండ్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కినట్లు ట్రైలర్ లో కనిపిస్తుంది. ట్రైలర్ లో ‘ఈ సమాజం నన్ను నేరస్థుడన్నది. కానీ, నేనొక బాధితుడ్ని’ అంటూ హత్యలకు పూనుకుంటాడో వ్యక్తి. ‘మనలో ఒకరిని కాపాడుకోవడం కోసం ఎవరినైనా, ఎంతమందినైనా చంపాల్సిందే’ అన్న మహిళ డైలాగ్‌తో.. ఈ సిరీస్ లో రక్తపాతం ఎక్కువే ఉంటుందని అర్థమవుతోంది. జూన్ 15న రిలీజ్ కానున్న ఈ సిరీస్ లో రిషీ, శెల్లి, దేవయాని ప్రధాన పాత్రలు పోషించారు.




Updated : 5 Jun 2023 8:42 PM IST
Tags:    
Next Story
Share it
Top