Director Prashant Varma : ఆరుగురు సూపర్ హీరోలు.. 20 స్క్రిప్ట్‌లు.. ప్రతీ సంక్రాంతికి ఓ సినిమా
X
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు వినిపిస్తుంది ఒకటే పేరు.. ప్రశాంత్ వర్మ. తీసింది కొన్ని సినిమాలే అయినా.. తన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి వచ్చిన తాజా సినిమా హనుమాన్. యంగ్ హీరో తేజ సజ్జ నటించిన ఈ సినిమా.. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై, బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. అన్ని విభాగాల్లో సినిమా బాగుందని, హనుమంతున్ని చూపించిన విధానానికి డైరెక్టర్ కు హాట్స్ఆఫ్ చెప్తున్నారు. ఈ ఇంపాక్ట్ తో థియేటర్లన్నీ దేవాలయాల్ని తలపిస్తున్నాయి. ఆ రేంజ్ లో ప్రేక్షకులకు కనెక్ట్ అయింది మరి. ఇక సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి తనను హనుమంతుడే నడిపించారని.. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. ఇక తన సినిమాటిక్ యూనివర్స్ గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.
‘ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ కు సంబంధించి మొత్తం 20 స్రిప్టులను రెడీ చేశా. ఫస్ట్ ఫేజ్ లో ఆరుగురు సూపర్ హీరోలతో సినిమా తీస్తా. నాతో పాటు మరికొంతమంది కొత్త డైరెక్టర్లు పరిచయం అవుతారు. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రతీ సంక్రాంతికి ఒక సినిమా వస్తుంది. జై హనుమాన్, అధీర సినిమాలతో పాటు సూపర్ విమెన్ కథలు కూడా వస్తాయి. ప్రస్తుతం వీటికి సంబంధించిన మూడు సినిమాలు రెడీ చేస్తున్నాం. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ తో సంబంధిం లేకుండా వేరే సినిమా ఒకటి రాబోతుంది. ఆ సినిమా షూటింగ్ 90 శాతం పూర్తైంది. మరో నెలరోజుల్లో పూర్తిచేసి.. అన్ని వివరాలు ప్రకటిస్తా’ అని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు.