Director Prashant Varma : మహాభారతంలో ప్రభాస్, అల్లు అర్జున్లకు నో చాన్స్
X
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ సినిమా హనుమాన్. ప్రశాంత్ వర్మ మల్టీవర్స్ లో భాగంగా వస్తున్న మొదటి తెలుగు సూపర్ హీరో సినిమా ఇది. ఇందులో తేజ సజ్జ హీరోగా నటిస్తున్నాడు. కాగా సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెరిగాయి. ఇప్పటికే వచ్చిన టీజర్ తో హనుమాన్ పై భారగా హైప్ పెరిగిపోయింది. జనవరి 12న థియేటర్స్ లో విడుదలవుతుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ ప్రశాంత్.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. అందులో భాగంగా అతని డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అందులో ఏ హీరోకి ఏ ఏ పాత్రలు ఇవ్వనున్న విషయాన్ని పంచుకున్నాడు.
దీంతో ఆ లిస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ లిస్ట్ లో కృష్ణుడిగా మహేష్ బాబు, అర్జునుడి పాత్ర కోసం రామ్ చరణ్, భీముడిగా ఎన్టీఆర్, కర్ణుడు పాత్రకు పవన్ కళ్యాణ్, ధర్మరాజు పాత్రకు చిరంజీవి, నకులుడు పాత్రకు నాని, సహదేవుడిగా విజయ్ దేవరకొండ, దుర్యోధనుడు పాత్రకు మోహన్ బాబును సెలక్ట్ చేసినట్లు ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చాడు. ఈ లిస్ట్ లో టాలీవుడ్ స్టార్ హీరోలకు మాత్రం చాన్స్ ఇవ్వలేదు. ప్రభాస్, అల్లు అర్జున్ లకు ఈ లిస్ట్ లో చోటుదక్కలేదు. గ్లోబల్ స్టార్స్ ను ప్రశాంత్ వర్మ ఎందుకు పక్కనబెట్టినట్లు అని అందరిలో ఒకటే ప్రశ్న మొదలైంది. ఈ హీరోల అభిమానులు కూడా అదే కామెంట్ చేస్తున్నారు.