'జై హనుమాన్' ఇప్పట్లో లేనట్టే.. అనుపమతో ఆ డైరెక్టర్ మూవీ
X
టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో తేజ సజ్జ, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్ మూవీ బాక్సాఫీసు వద్ద భారీ హిట్‌ను సాధించింది. ఈ మూవీకి సెకండ్ పార్ట్ త్వరలోనే రానుందని మేకర్స్ ప్రకటించారు. హనుమాన్ మూవీ చివర్లో సెకండర్ పార్ట్‌కి లీడ్ ఇచ్చి భారీ అంచనాలను క్రియేట్ చేశారు. దీంతో సెకండ్ పార్ట్ అయిన 'జై హనుమాన్' కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఇప్పుడొక బ్యాడ్ న్యూస్.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సెకండ్ పార్ట్‌ని పక్కనబెట్టి టిల్లు స్క్వేర్ హీరోయిన్ అనుపమతో సినిమా చేస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. జై హనుమాన్ మూవీని పక్కన పెట్టేసి అనుపమతో సినిమా స్టార్ట్ చేయడానికి ఓ కారణం ఉందంట. జై హనుమాన్ మూవీలో మెయిన్ లీడ్‌లో ఓ స్టార్ హీరో చేస్తున్నారట. ఆ హీరో ఎవరన్నది మాత్రం తెలియడం లేదు. అయితే ఆ స్టార్ హీరో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో సినిమా కాస్త లేట్ అవుతోందట. అందుకే ప్రశాంత్ వర్మ ఆ మూవీని పక్కన పెట్టి అనుపమతో ఆక్టోపస్ అనే మూవీ చేస్తున్నాడు.
ఈ మూవీ షూటింగ్ కూడా 65 శాతం కంప్లీట్ అయిపోయిందట. సీక్రెట్‌గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటోన్న ఈ మూవీ వివరాలను త్వరలోనే అనౌన్స్ చేస్తామని మేకర్స్ చెబుతున్నారు. మరి ఈ మూవీ విడుదలయ్యాకే జై హనుమాన్ పట్టాలెక్కనుంది. ఈ విషయం తెలిసి జై హనుమాన్ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారట. అయితే అనుపమతో చేస్తున్న సినిమా ఆక్టోపస్ కూడా హనుమాన్ యూనివర్స్‌లో భాగంగానే వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.