Home > సినిమా > ఫ్యామిలీ వెకేషన్‎లో రాజమౌళి..చెన్నై తీరంలో సందడి

ఫ్యామిలీ వెకేషన్‎లో రాజమౌళి..చెన్నై తీరంలో సందడి

ఫ్యామిలీ వెకేషన్‎లో రాజమౌళి..చెన్నై తీరంలో సందడి
X

ఆర్ఆర్ఆర్‎ సినిమాతో తీరికలేని షూటింగ్‎లు, ప్రమోషన్లతో బిజీబిజీగా గడిపిన దర్శకధీరుడు రాజమౌళి తాజాగా తన సమ్మర్ వెకేషన్‎ను జాలీగా ఎంజాయ్ చేశారు. చాలా రోజుల తరువాత ఫ్యామిలీతో కలిసి విలువైన సమయాన్ని గడిపారు జక్కన్న. సమ్మర్ వెకేషన్ కోసం కుటుంబసమేతంగా తమిళనాడులోని తూత్తుకుడికి వెళ్లారు. రాజమౌళితో పాటు రమ, కుమారుడు కార్తికేయ, కోడలు పూజ, కూతురు మయూఖ కూడా ఈ టూర్‎కి వెళ్లారు. వెకేషన్‎కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను రాజమౌళి స్టే చేసిన రిసార్ట్ నిర్వాహకులు సోషల్‌మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.





తమిళనాడు టుటికోరిన్‌లోని వాటర్ స్పోర్ట్స్‌కు ప్రసిద్ధి చెందిన ఆక్వా అవుట్‌బ్యాక్‌లో మరిచిపోలేని విహారయాత్రను గడిపారు రాజమౌళి అండ్ ఫ్యామిలీ. వెకేషన్‎ను ఎంజాయ్ చేయడంతో పాటు రిసార్ట్ ప్రాంగణంలో మొక్కలను నాటి తమ అభిమానులను అలరించారు. ఈ పిక్స్ కూడా నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.





'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాతో రాజమౌళి వరల్డ్ వైడ్‎గా పాపులారిటీని సంపాదించుకున్నారు . తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మహేశ్‌ బాబుతో చేస్తున్నారు . ఇప్పటికే విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేశారు. యాక్షన్ అడ్వెంచరస్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రపంచాన్ని చుట్టే సాహసికుడు అని జక్కన్నే స్వయంగా చెప్పడంతో ఈ సినిమాపై భారీ అంచానలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాదిలో షూటింగ్‌ ప్రారంభమవుతుందని సమాచారం.








Updated : 27 Jun 2023 1:41 PM IST
Tags:    
Next Story
Share it
Top