అయ్యయ్యో....పరువు తీశేసాడుగా...
X
వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టటార్ చిరంజీవి తీసిన సినిమా భోళా శంకర్. నిన్న విడుదల అయిన ఈ మూవీ మొదటి నుంచి నెగటివ్ టాక్ తెచ్చుకుంటోంది. చిరు ఖాతాలో మరో డిజాస్టర్ అని చెప్పుకుంటున్నారు. ఇక రాంగోపాలవర్మ లాంటివాళ్ళు అయితే చిరు మీద డైరెక్ట్ గా సెటైర్లు వేస్తున్నారు.
మామూలుగా మెగాఫ్యాన్స్ ఎలా ఉంటారంటే... తమ హీరోల సినిమా ఎలా ఉన్నా....ఆడించేస్తారు. మిగతా వాళ్ళు అంతా తిడుతున్నా మొత్తం బాధ్యత అంతా తమ నెత్తి మీ వేసుకుంటారు. ముఖ్యంగా చిరంజీవి, పవన్ కల్యాణ్ ఫాన్స్ అయితే ఇంకానూ. కానీ భోళా శంకర్ ను మెగా అభిమానులే బాలేదంటున్నారు. చిరు ఇమేజ్ ని డ్యామేజ్ చేసేలా ఉందని తెగ బాధపడిపోతున్నారు. మెగాస్టార్ చేసిన స్పూఫ్ ల విషయంలో అయితే మరీను. ఆయన ఏజ్ కి ఇలాంటివి చేసి ఉండకూడదని విమర్శిస్తున్నారు. ప్లీజ్ దయచేసి ఇక మీదట రీమేక్ లు చేయొద్దు అని చేతులెత్తి మరీ ప్రార్ధిస్తున్నారు.
భోళా శంకర్ మీద సోషల్ మీడియాలో కూడా తెగ చర్చలు జరుగుతున్నాయి. దానికి తోడు సెన్సేషనల్ డైరెక్టర్ రాంగోపాలవర్మ కూడా మొదటి నుంచీ ఈ సినిమా మీద కాంట్రవర్శీ ట్వీట్లు చేస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ లో కొంతమంది చాలా అతిగా మాట్లాడారని వర్మ ట్వీట్లతో విరుచుకుపడ్డారు. ఇప్పుడు భోళా శంకర్ రిలీజ్ అయి ఫ్లాప్ టాక్ తెలచ్చుకుంటున్న ఈ సమయంలో మరోసారి చిరు మీద కాంటవర్శీ ట్వీట్ పెట్టారు రాంగోపాలవర్మ. వాల్తేరు వీరయ్య ఎవరి వల్ల ఆడిందో ప్రూవ్ చేయడానికే భోళా శంకర్ సినిమా తీసినట్టుంది అంటూ కామెంట్ చేశారు. వాల్తేరు వీరయ్యలో రవితేజ చిరంజీవి తమ్ముడిగా, ఒక హీరోగా చేశారు. అతని వలన కూడా అప్పుడు ఆ సినిమా హిట్ అయింది. ఇప్పుడు అదే విషయాన్ని రాంగోపాలవర్మ డైరెక్ట్ గా చెబుతున్నారు. ఆ మూవీ చిరంజీవి వల్ల కాదు రవితేజ వలనే హిట్ అయిందని కామెంట్ చేసినట్లు అయింది.
వాల్తేరు వీరయ్య ఎవరి మూలాన ఆడిందో , ప్రూవ్ చెయ్యటానికి తీసినట్టుంది బి ఎస్ 😳
— Ram Gopal Varma (@RGVzoomin) August 12, 2023