వామ్మో అంతా.. యానిమల్ రన్ టైం ఎంతో చెప్పిన డైరెక్టర్..
X
డైరెక్టర్ సందీప్ వంగ.. ఈ పేరు చెప్తే గుర్తొచ్చే సినిమా అర్జున్ రెడ్డి. మొదటి సినిమాతో యమ క్రేజ్ సంపాదించుకున్నాడు సందీప్. బాలీవుడ్ స్టార్ హీర్ రణ్బీర్ కపూర్తో కలిసి యానిమల్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్గా రష్మిక చేస్తుండగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ ప్రేక్షకులు.. ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 1న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.
ఇక ఈ సినిమా రన్ టైంకు సంబంధించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో డైరెక్టర్ సందీప్ రన్ టైంపై స్పందించారు. యానిమల్ సినిమా రన్ టైం 3 గంటల 21 నిమిషాల 23 సెకన్లు అంటూ సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఈ మధ్య కాలంలో రిలీజైన చిత్రాల్లో ఎక్కువ నిడివి ఉన్న బాలీవుడ్ చిత్రంగా యానిమల్ నిలవనుంది. 2016లో విడుదలైన ‘ధోనీ’ తర్వాత 3 గంటలకు పైగా నిడివి ఉన్న హిందీ చిత్రం ఇదే కావడం విశేషం. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.