Home > సినిమా > చిరంజీవితో సినిమా.. సందీప్ రెడ్డి వంగా కీలక వ్యాఖ్యలు

చిరంజీవితో సినిమా.. సందీప్ రెడ్డి వంగా కీలక వ్యాఖ్యలు

చిరంజీవితో సినిమా.. సందీప్ రెడ్డి వంగా కీలక వ్యాఖ్యలు
X

సందీప్ రెడ్డి వంగా, రణ్బీర్ కపూర్ కాంబినేషన్లో వచ్చిన సినిమా యానిమల్. డిసెంబర్ 1న రిలీజైన ఈ మూవీ రికార్డు కలెక్షన్స్తో దుమ్మురేపుతోంది. ఫాదర్ సెంటిమెంట్, యాక్షన్ జానర్లో రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. 8 రోజుల్లోనే ఈ మూవీ 800 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్లో డైరెక్టర్ సందీప్ రెడ్డి బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన అమెరికా వెళ్ళారు. ఈ సందర్భంగా అక్కడి తెలుగువారితో ముచ్చటించిన ఆయన మెగాస్టార్ చిరంజీవితో సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు.

సందీప్కు చిరంజీవి అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవితో అవకాశం వస్తే ఓ మూవీ చేయాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టాడు సందీప్. చిరుతో యాక్షన్ డ్రామా సినిమా చేస్తానని చెప్పాడు. ఇక యానిమల్ సినిమా మహిళలపై ద్వేషం, హింసను ప్రేరేపించేలా ఉందంటూ వస్తున్న విమర్శలపై కూడా ఆయన స్పందించారు. సినిమాను సినిమాలాగే చూడాలని అన్నారు. ‘‘ఇక్కడికి వచ్చిన వారు మహిళలపై ద్వేషం గురించి క్వశ్చన్స్ వేయలేదు. మీరు సరైన ప్రేక్షకులు. మీరు యానిమల్‍ను ఓ సినిమాలాగే చూశారు. నాకు చాలా సంతోషంగా ఉంది” అని సందీప్ అన్నారు. కాగా సందీప్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ప్రభాస్తో చేస్తున్నాడు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి స్టార్ట్ కానుంది.

Updated : 9 Dec 2023 9:57 PM IST
Tags:    
Next Story
Share it
Top