Sandeep Reddy Vanga : ట్విస్ట్ ఇచ్చిన సందీప్.. నెలరోజుల్లో షూటింగ్ షురూ
X
(Sandeep Reddy Vanga) అర్జున్ రెడ్డి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. యానిమల్ సినిమాతో అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు. రష్మిక మందన, రన్ బీర్ కపూర్ జంటగా వచ్చిన ఈ సినిమా.. డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు రూ.1000 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా.. పలు రికార్డులను బద్దలుకొట్టింది. దీంతో సందీప్ రెడ్డి వంగ పేర్ పాన్ ఇండియా లెవల్ లో పాపులర్ అయింది. తన తర్వాత సినిమాలపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. కాగా సందీప్ తన నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు స్పిరిట్ అనే పేరును కూడా కన్ ఫార్మ్ చేశారు. తన అన్ని సినిమాల లాగా స్పిరిట్ కూడా వైలెంట్ గా ఉంటుందని సందీప్ ప్రకటించడంతో.. అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రభాస్, సందీప్ కాంబినేషన్ లో వస్తునన్ మాస్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అయితే తాజాగా సమాచారం ప్రకారం స్పిరిట్ సినిమా ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ వేరే సినిమాలకు కమిట్మెంట్స్ ఇవ్వడం.. వాటితోనే ఫుల్ బిజీగా ఉండటంతో స్పిరిట్ లేట్ అవుతుంది. దీంతో ఈ గ్యాప్ లో సందీప్ యానిమల్ సినిమా సీక్వెల్ ను తెరకెక్కిచబోతున్నాడట. మరో నెలరోజుల్లో స్రిప్ట్ వర్క్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తిచేసుకుని.. షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నారు. 2025 ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు.