Home > సినిమా > మహేష్ బాబుతో సినిమాపై సందీప్ వంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మహేష్ బాబుతో సినిమాపై సందీప్ వంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మహేష్ బాబుతో సినిమాపై సందీప్ వంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

డైరెక్టర్ సందీప్ వంగ.. ఈ పేరు చెప్తే గుర్తొచ్చే సినిమా అర్జున్ రెడ్డి. మొదటి సినిమాతోనే యమ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక బాలీవుడ్ స్టార్ హీర్ రణ్బీర్ కపూర్తో తెరకెక్కించిన యానిమల్ సినిమా డిసెంబర్ 1 రిలీజ్ కానుంది. తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌ కథతో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కింది. ఇందులో హీరోయిన్గా రష్మిక చేస్తుండగా.. అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం సందీప్ ఈ మూవీ ప్రమోషన్స్తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో మహేష్ బాబుతో సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మహేశ్‌బాబుకి ఇప్పటికే ఓ కథ చెప్పానని.. అది ఆయనకు కూడా బాగా నచ్చిందని సందీప్ చెప్పారు. ‘‘ మహేష్ బాబుకు ఓ కథ చెప్పారు. ఆయనకు అది ఎంతో నచ్చింది. కాకపోతే ఆయనకు వేరే ప్రాజెక్ట్స్‌ ఉండటం వల్ల మా సినిమా పట్టాలెక్కలేదు. ప్రభాస్‌, అల్లు అర్జున్‌తో సినిమాలు కంప్లీట్ అయ్యాక మహేష్, రామ్‌చరణ్‌తోపాటు చాలామంది హీరోలతో సినిమాలు చేయాలని ఉంది’’ అని సందీప్ అన్నారు. ఇక ప్రభాస్ తో పాటు తాను తీయబోయే సినిమా ప్రీ ప్రొడోన్ వర్క్ జూన్ నుంచి ప్రారంభమవుతుందని తెలిపారు.

యానిమల్ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చింది. ట్రైలర్ మొత్తం ఫాదర్ అండ్ సన్ బాండింగ్ చుట్టూనే తిరిగింది. ఎమోషన్ తో పాటు యాక్షన్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. సినిమా మొత్తం హిందీ యాక్టర్స్తోనే నిడిపోయినా.. సౌత్ నేటివిటీకి తగ్గట్టు మూవీ ఉన్నట్లు తెలుస్తుంది. ట్రైలర్తో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. సందీప్ వంగా డైరెక్షన్ కావడంతో తెలుగులో కూడా భారీ ఓపెనింగ్స్ నమోదు అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ సినిమా చేయబోయే విధ్వంసం బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజులో ఉండబోతుందో తెలియాలి అంటే డిసెంబర్ 1 వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.

Updated : 25 Nov 2023 9:48 PM IST
Tags:    
Next Story
Share it
Top