హీరోయిన్లను వేశ్యలుగా చూపిస్తోన్న భన్సాలీ..'హీరామండీ' టీజర్ విడుదల
X
ప్రేమ కథలైనా, యాక్షన్ చిత్రాలనైనా తెరకెక్కించడంలో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దిట్ట. ఆయన సినిమాలు ఎక్కువగా వాస్తవిక కథల ఆధారంగా రూపొందుతాయి. కళ్లకు కట్టినట్లు చూపించడంలో ఆయనకు సాటి మరెవరూ రారు. అలాంటి భన్సాలీ సినిమా థియేటర్లలోకి ఎప్పుడొస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా ఆయన 'హీరామండి: ది డైమండ్ బజార్' అనే వెబ్‌సిరీస్ చేస్తున్నాడు. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీలో బాలీవుడ్ టాప్ హీరోయిన్లు మనీసా కోయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావ్ హైదరీ, రిచా చద్దా, షర్మిన్ సెగల్, సంజీదా షేక్ వంటివారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సిరీస్‌ను భన్సాలీతో పాటు విభుపూరి, మితాక్షర కుమార్ నిర్మిస్తున్నారు. తాజాగా హీరామండీ సిరీస్‌కు సంబంధించిన టీజర్‌ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే ఇది ప్రేమ, స్వేచ్ఛ రెండింటి కలయికతో రూపొందే పీరియాడిక్ డ్రామాగా అనిపిస్తోంది. ఇందులో కథానాయికల్ని భన్సాలీ వేశ్యలుగా చూపిస్తున్నారు. ఆ కథానాయికల ప్రపంచాన్ని పరిచయం చేస్తూ సాగే టీజర్ ఎంతో ఆసక్తికరంగా ఉంది.
స్వాతంత్య్రానికి ముందుగా పాకిస్తాన్ లోని లాహోర్‌లో వేశ్యలతో కూడిన నగరం ఉండేది. అందులోని కొందరి జీవితాల ఆధారంగా ఈ సిరీస్‌ను భన్సాలీ రూపొందిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. బాలీవుడ్‌లో భన్సాలీ ఇది వరకూ దేవదాస్, పద్మావత్, బాజీరావ్ మస్తానీ, రామ్ లీలా వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు తొలిసారిగా ఓటీటీలోకి ఆయన అడుగుపెడుతున్నారు. స్వాతంత్య్రానికి ముందు వేశ్యల జీవితాలను కళ్లకు కట్టేలా భన్సాలీ ఈ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. 1940 బ్యాక్ డ్రాప్‌లో హీరామండీ సంస్కృతిని భన్సాలీ చూపించనున్నాడు.
హీరామండీ సిరీస్‌పై సంజయ్ భన్సాలీ గతంలోనూ స్పందించాడు. ఫిల్మ్ మేకర్‌గా హీరామండి తన కెరీర్లో ఓ పెద్ద మైలురాయి అని తెలిపారు. మరోవైపు భన్సాలీ తన తదుపరి ప్రాజెక్ట్‌ను కూడా ప్రకటించారు. లవ్ అండ్ వార్ పేరుతో ఆ మూవీ రానుందని, అందులో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ నటిస్తున్నట్లు తెలిపారు. భన్సాలీ చివరిసారిగా ఆలియా భట్‌తో గంగూబాయి కఠియావాడి మూవీ చేశారు. ఇప్పుడు మరోసారి ఆలియా భట్‌తోనే సినిమా చేస్తున్నారు.