Home > సినిమా > చనిపోయిన వాళ్ళను వెనక్కి తీసుకొస్తున్న శంకర్

చనిపోయిన వాళ్ళను వెనక్కి తీసుకొస్తున్న శంకర్

చనిపోయిన వాళ్ళను వెనక్కి తీసుకొస్తున్న శంకర్
X

చనిపోయిన వాళ్ళను దర్శకుడు శంకర్ మళ్ళీ తీసుకువస్తున్నారు. అదేంటీ...శంకర్ కు ఏదైనా మ్యాజిక్ లేదా మంత్రాలు లాంటివి వచ్చా...అలా ఎలా తీసుకువస్తారు అనుకుంటున్నారా. మంత్రాలకు చింతకాయలు రాలవు కానీ టెక్నాలజీకి రాలుతాయి. శంకర్ దాన్ని ఉపయోగించుకునే తన సినిమా భారతీయుడు 2లో చనిపోయిన నటుల చేత యాక్ట్ చేయిస్తున్నారు.

భారతీయుడు -2 సినిమాను ఎప్పుడో మొదలుపెట్టారు. అనుకోని కొన్ని కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. దాన్ని పక్కకు పెట్టి శంకర్ రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత భారతీయుడుకి ఉన్న అడ్డంకులు తొలగిపోవడంతో ఆ సినిమా షూటింగ్ కూడా తిరిగి స్టార్ట చేశారు. అయితే ఈలోపు చాలా పరిణామాలు జరిగిపోయాయి. భారతీయుడు-2లో కీలకపాత్రలు పోషిస్తున్న కమెడియన్ వివేక్. నెడుముడి వేణులు చనిపోయారు. కానీ వాళ్ళు నటించాల్సిన పాత్రల షూటింగ్ మాత్రం ఇంకా మిగిలే ఉంది. ఇప్పుడు వాళ్ళ ప్లేస్ లో మరొకరిని పెట్టకుండా...టెక్నాలజీ సాయంతో వాళ్ళే మళ్ళీ నటించేలా చేస్తున్నారు శంకర్.

మామూలుగానే మిగతా దర్శకులకన్నా శంకర్ ఓ పది అడుగులు ముందే ఉంటారు. టెక్నాలజీని ఉపయోగించడంలో సిద్ధహస్తుడు. అదే ఎక్స్పీరియన్స్ తో హాలీవుడ్ టెక్నాలజీని ఉపయోగించుకుని వివేక్, వేణులు ఉన్న సీన్స్ ను చూపించనున్నారు శంకర్. అలాగే కమల్ హాసన్ ను కూడా గ్రాఫిక్స్ సహాయంతో యంగ్ గా చూపించనున్నారని అనుకుంటున్నారు. శంకర్ చేస్తున్న ఈ ప్రయోగాలు సినిమాకు ప్లస్ అవుతాయని అంటున్నారు మూవీ టీమ్. ఈయన తీసిన లాస్ట్ సినిమా రోబో 2.0. కానీ ఫస్ట్ ది హిట్ అయినంతగా 2.0 అవలేదు. ఇప్పుడు ఇండియన్ -2 తో అయినా భారీ కలెక్షన్స్ సాధించాలని అనుకుంటున్నారు శంకర్. అలాగే రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ తో కూడా మళ్ళీ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలని భావిస్తున్నారుట.



Updated : 18 July 2023 1:03 PM IST
Tags:    
Next Story
Share it
Top