వెంకీ మూవీకి సీక్వెల్..క్రేజీ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్
X
మాస్ మహారాజ రవితేజ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో 20 ఏళ్ల క్రితం వచ్చిన మూవీ వెంకీ. యాక్షన్ కామెడీ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కింది. టాలీవుడ్ ఆడియన్స్ ఈ మూవీకి బాగా కనెక్ట్ అయ్యారు. ఈ మూవీలో వచ్చే ట్రైన్ సీక్వెన్స్ కామెడీ సీన్స్ ఇప్పటికీ గుర్తు చేసుకుంటూనే ఉంటారు. రవితేజ, బ్రహ్మానందం, ఏవీఎస్, వేణుమాధవ్ మధ్య సాగే కామెడీ సీన్స్ కడుపుబ్బా నవ్విస్తుంటాయి. ఇప్పటి ఆడియన్స్ కూడా ఈ మూవీని విపరీతంగా ఇష్టపడుతుంటారు.
సోషల్ మీడియాలో మీమర్స్ ఇప్పటికీ ఈ మూవీలోని సీన్స్2తో మీమ్స్ క్రియేట్ చేసి పోస్ట్ చేస్తుంటారు. అందుకే టాలీవుడ్ ఆడియన్స్‌లో ఈ మూవీకి ప్రత్యేక స్థానం ఉండిపోయింది. ఈ మధ్యనే ఈ మూవీని రీరిలీజ్ చేసినా థియేటర్స్‌లో ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. 2004లో రిలీజ్ అయిన ఈ మూవీ నేటితో 20 ఏళ్లు కంప్లీట్ చేసుకుంది. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్ మరోసారి ఈ సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. తాజాగా ఈ మూవీ సీక్వెల్‌పై దర్శకుడు శ్రీను వైట్ల రియాక్ట్ అయ్యారు.
డైరెక్టర్ శ్రీనువైట్ల మాట్లాడుతూ.. అభిమానులు కోరిక మేరకు ఈ మూవీ పనులను స్టార్ట్ చేస్తున్నామన్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవుతుందన్నారు. అతిత్వరలో అనౌన్స్‌మెంట్ ఉంటుందన్నారు. ఈ విషయం తెలిసిన రవితేజ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీను వైట్ల గోపిచంద్‌తో ఓ మూవీ చేస్తున్నాడు. ఇక హరీష్ శంకర్‌తో రవితేజ మూవీ షూటింగ్ జరుగుతోంది.
It has been 20 Years and "Venky" remains closest to my heart!!
— Sreenu Vaitla (@SreenuVaitla) March 26, 2024
It was an amazing experience that I always cherish..
The movie was full of crazy moments and memories!!
The way @RaviTeja_offl portrayed his character and supported me is simply awesome!!
I thank @ThisIsDSP,… pic.twitter.com/I08Ez5NDCL