Director Teja : జూబ్లీహిల్స్లోనే ఎక్కువమంది దేశద్రోహులు ఉన్నారు : తేజ
X
తెలంగాణలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కొన్ని చోట్ల జనాలు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అటు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం తమ క్యూలైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 52శాతం పోలింగ్ నమోదైంది. అయితే హైదరాబాద్లో మాత్రం అతితక్కువ ఓటింగ్ నమోదైంది. ఈ క్రమంలో ఓటు హక్కు వినియోగించుకున్న దర్శకుడు తేజ.. ఓటర్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఓటు వేయని వారంతా దేశ ద్రోహులేనని తేజ అన్నాడు. జూబ్లిహిల్స్‌లో ఎక్కువ మంది ఓటు వేయరని.. అందుకే ఇక్కడ ఎక్కువ మంది దేశద్రోహులు ఉన్నారని సెటైర్ వేశాడు. ఓటు వేయకపోతే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కుని కోల్పోతారని చెప్పారు. అదేవిధంగా అల్లు అరవింద్ సైతం ఓటర్లకు కీలక సూచనలు చేశారు. హాలీడే దొరికింది కదా? అని బీరు తాగి పడుకోకండి.. వచ్చి ఓటెయ్యాలని అన్నారు. అప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కుని కలిగి ఉంటారని చెప్పారు.