Home > సినిమా > నిన్ననే పెళ్లైనట్టుంది.. అప్పుడే ఏడాది గడిచిందా..? - విఘ్నేష్ శివన్

నిన్ననే పెళ్లైనట్టుంది.. అప్పుడే ఏడాది గడిచిందా..? - విఘ్నేష్ శివన్

నిన్ననే పెళ్లైనట్టుంది.. అప్పుడే ఏడాది గడిచిందా..? - విఘ్నేష్ శివన్
X

సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ వివాహ బంధంతో ఒక్కటై ఏడాది పూర్తైంది. 2022 జూన్ 9న పెళ్లి చేసుకున్న వీరకి అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లైన కొన్నాళ్లకే ఈ జంట సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.

డైరెక్టర్ విఘ్నేష్ నయన్ తో పాటు తన బిడ్డల ఫొటోలను రెగ్యులర్ గా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు. తాజాగా పెళ్లి రోజు సందర్భంగా ఆయన వారిద్దరి ఫొటోలు స్పెషల్ గా పోస్ట్ చేశారు. నయన్ – విఘ్నేష్ ఫారిన్ లో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేస్తూ.. నిన్ననే పెళ్లైనట్లు అనిపిస్తుంది. సడెన్గా అందరూ ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెబుతున్నారని రాసుకొచ్చాడు. లవ్ యు తంగమై. మన జర్నీని ప్రేమ, ఆశీర్వాదాలతో మొదలుపెట్టాం. మనం కలిసి సాధించాల్సినవి చాలా ఉన్నాయి. మా జీవితంలో ఉన్న మంచి వ్యక్తులు, దేవుని ఆశీర్వాదంతో రెండో ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం అని విఘ్నేష్ శివన్ రాసుకొచ్చాడు.

మరో పోస్టులో నయనతారతో పాటు తన కవల పిల్లల ఫోటోలను విఘ్నేష్ షేర్ చేశారు. అప్పుడే సంవత్సరమైంది. ఏడాదిలో చాలా స్పెషల్ మూమెంట్స్, కష్ట సుఖాలు ఉన్నాయి. ఇంటికొస్తే ప్రేమగా చూసుకునే ఫ్యామిలీ ఉంది. నాకు ఎంతో స్పెషల్ అయిన ఉయర్, ఉలగంలు మా జీవితాన్ని మరింత అందంగా మార్చారు. వారు ఎనర్జీ ఇస్తూ నా డ్రీమ్స్ వైపు మరింత పరిగెత్తేలా చేస్తున్నారంటూ విఘ్నేష్ మరో ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.


Updated : 9 Jun 2023 1:52 PM IST
Tags:    
Next Story
Share it
Top