Home > సినిమా > ఆసియా కప్, వరల్డ్ కప్ కూడా ఫ్రీగా చూడొచ్చు.. ఎలాంగంటే..

ఆసియా కప్, వరల్డ్ కప్ కూడా ఫ్రీగా చూడొచ్చు.. ఎలాంగంటే..

ఆసియా కప్, వరల్డ్ కప్ కూడా ఫ్రీగా చూడొచ్చు.. ఎలాంగంటే..
X

క్రికెట్ ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్. ఇన్నిరోజులు ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లను ఫ్రీగా చూసిన ఫ్యాన్స్.. ఇప్పుడు రాబోయే ఆసియా కప్‌‌, వరల్డ్‌‌‌‌‌‌‌ కప్‌ మ్యాచ్‌‌‌‌‌ లను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఈ విషయాన్ని డిస్నీ+ హాట్‌‌‌‌‌‌‌ ‌స్టార్‌‌‌‌‌‌‌ వెల్లడించింది. అవును .. మొబైల్ లో ఎలాంటి సబ్‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్‌ ప్లాన్‌‌‌‌‌‌‌ లేకుండా ఈ రెండు మెగా టోర్నీలను చూడొచ్చని డిస్నీ శుక్రవారం ప్రకటించింది. మరింత మందికి క్రికెట్‌‌‌‌‌‌‌‌ వినోదాన్ని పంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు డిస్నీ తెలిపింది.

ఐపీఎల్‌‌‌‌‌‌‌‌ ప్రసారం చేయడంతో జియో సినిమా సూపర్‌‌‌‌‌‌‌‌ వ్యూయర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌ సాధించింది. ఇదే స్ట్రాటజీని ఇప్పుడు డిస్నీ కూడా ఫాలో అవుతుంది. డిజిటల్​ ఫ్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్‌‌‌ ఓ కొత్త ఆలోచన‌‌‌‌‌ వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఐసీసీ టోర్నీలకు సంబంధించిన టీవీ రైట్స్‌‌‌‌‌‌‌‌ మొత్తం డిస్నీ హాట్‌‌‌‌‌‌‌‌స్టార్‌‌‌‌‌‌‌‌ చేతుల్లో ఉండటంతో ఫ్రీ లైవ్‌‌ టెలికాస్ట్ చేసి యూజర్లకు దగ్గరవుదామని చూస్తోంది. అయితే ఈ ఫ్రీ టెలికాస్ట్ కేవలం మొబైల్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. టీవీ, ఇతర వాటిలో చూసే వాళ్లు మాత్రం ఆయా సబ్ స్క్రిప్షన్ ప్లాన్లు తీసుకోవాలి.

Updated : 10 Jun 2023 11:30 AM IST
Tags:    
Next Story
Share it
Top