Home > సినిమా > విజయ్ దేవరకొండ చేతులమీదుగా ఫిల్మ్ జర్నలిస్టులకు ఐడీ, హెల్త్ కార్డులు పంపిణీ

విజయ్ దేవరకొండ చేతులమీదుగా ఫిల్మ్ జర్నలిస్టులకు ఐడీ, హెల్త్ కార్డులు పంపిణీ

విజయ్ దేవరకొండ చేతులమీదుగా ఫిల్మ్ జర్నలిస్టులకు ఐడీ, హెల్త్ కార్డులు పంపిణీ
X

తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(TFJA).. సభ్యుల సంక్షేమం నిరంతరం కృషి చేస్తోన్న సంఘం. ఈ ఏడాదిలో అసోషియేష‌న్ రెండు ద‌శాబ్దాల‌ను పూర్తి చేసుకుంది. అసోషియేష‌న్ సభ్యుల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల బాగోగులను చూస్తూ ప్రతి సంఘ సభ్యుడికీ ఇంటి పెద్దలా అండగా నిలుస్తూ వస్తోంది టిఎఫ్‌జేఏ. ఇందులో చేరిన ప్రతి సభ్యుడి కుటుంబానికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యంతో, కుటుంబ స‌భ్యుల‌కు రూ.5 లక్ష‌లు ఆరోగ్య భీమా సౌకర్యం ఉంటుంది. అలాగే టర్మ్ పాలసీ విష‌యానికి వ‌స్తే స‌భ్యుడికి రూ.15 ల‌క్ష‌లు, యాక్సిడెంటల్ పాలసీ స‌భ్యుడికి రూ.25 ల‌క్ష‌ల‌ను అందేలా చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇందుకోసం పరిశ్రమ సహాయ సహకారాలతో పాటు అందరు సభ్యుల తోడ్పాటును తీసుకుంటోంది. ఈ ఏడాది (2024-25) వరకూ సభ్యత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డులతో పాటు, హెల్త్ కార్డ్స్ ను అందించినట్లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి, స్టార్ ప్రొడ్యూస‌ర్‌ దిల్ రాజు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టీఎఫ్‌జెఎ అధ్య‌క్షుడు ల‌క్ష్మీ నారాయ‌ణ‌, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ వై.జె.రాంబాబు, ట్రెజ‌ర‌ర్ సురేంద్ర నాయుడు స‌హా అసోసియేష‌న్ స‌భ్యులు, జ‌ర్న‌లిస్ట్‌లు పాల్గొన్నారు.

TFJA ట్రెజ‌ర‌ర్ సురేంద్ర నాయుడు మాట్లాడుతూ.. 20 ఏళ్లు స‌క్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుని ముందుకు సాగుతున్నామన్నారు. ఇప్పుడు 181 మంది స‌భ్యులం ఉన్నామని, ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ క‌లిపి 481 మంది ఉన్నట్లు తెలిపారు. TFJA జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ వై.జె.రాంబాబు మాట్లాడుతూ.. 20 ఏళ్ల అసోసియేష‌న్‌లో హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇచ్చామన్నారు. 2019లో డిజిట‌ల్ మీడియాను కూడా క‌లుపుకుని ఐదేళ్లు ఫీల్డ్‌లో ప‌నిచేసిన వారంద‌రికీ స‌భ్య‌త్వం ఇచ్చామన్నారు.

TFJA ప్రెసిడెంట్‌ వార‌ణాసి ల‌క్ష్మీనారాయ‌ణ మాట్లాడుతూ.. తెలుగు ఫిల్మ్ జ‌ర్న‌లిస్ట్ అసోసియేష‌న్ అంటే ఓ యూనిటీ, ఓ భ‌రోసా అని అన్నారు. త్వ‌ర‌లో హౌసింగ్ మెంబ‌ర్‌షిప్‌కి అంద‌రికీ ఆహ్వానం అందుతుందన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ‌లో 23వేల మంది అక్రిడేటెడ్ జ‌ర్న‌లిస్టులు ఉన్నారని, ప్ర‌తి సంస్థ‌లోనూ ఫిల్మ్ జ‌ర్న‌లిస్టుల‌కు ప్ర‌త్యేకంగా అక్రిడేష‌న్ ఇచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. జూన్ 6వ తేది త‌ర్వాత ఎలిజిబుల్ జ‌ర్న‌లిస్టుల‌కు హెల్త్ కార్డులు, ఇళ్ల స్థ‌లాలు, అక్రిడేష‌న్ కార్డులు అందించే ప్ర‌య‌త్నం చేస్తామన్నారు.

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ మాట్లాడుతూ.. జ‌ర్న‌లిస్టులకు హెల్త్ కార్డుల ఇవ్వడంలో తాను పాల్గొన‌డం చాలా ఆనందంగా ఉందన్నారు. జర్నలిస్టుల సేవలు మరువలేవన్నారు. నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ.. జ‌ర్న‌లిస్టుగా రాసే ప్రతి ప‌దం చాలా ముఖ్యమని, ఎక్క‌డో ఉన్న కుటుంబాల‌ను పైకి తీసుకురావ‌డం కోసం కృషి చేసే ఫిల్మ్ జర్నలిస్టులందరూ స్టార్స్ అని అన్నారు. పీపుల్స్ స్టార్ ఆర్‌.నారాయ‌ణ‌మూర్తి మాట్లాడుతూ.. జ‌ర్న‌లిస్టుల‌కు ఇళ్ల‌ను ఫ్రీగా ఇప్పించేందుకు స్థ‌లాల‌ను రేవంత్‌రెడ్డిగారిని అడ‌గండని చెప్పారు.

Updated : 23 March 2024 2:42 PM IST
Tags:    
Next Story
Share it
Top