Home > సినిమా > డీజే టిల్లు దెబ్బ.. 'ది గోట్ లైఫ్' మూవీకి షాక్

డీజే టిల్లు దెబ్బ.. 'ది గోట్ లైఫ్' మూవీకి షాక్

డీజే టిల్లు దెబ్బ.. ది గోట్ లైఫ్ మూవీకి షాక్
X

మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన తాజా చిత్రం ‘ది గోట్ లైఫ్'. తెలుగులో 'ఆడుజీవితం’ పేరుతో రిలీజ్ అవుతోంది. సర్వైవల్ థ్రిల్లర్ మూవీ సమ్మర్‌లో రావడం ఒక రకంగా మైనసే అని చెప్పాలి. ఎందుకంటే ఎడారి మధ్య సాగే ఎమోషనల్ మూవీని తెలుగు ప్రేక్షకులు అంతగా ఇష్టపడరని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. పైగా పుస్తక రూపంలో ఉన్న ఓ కథను మన ఆడియన్స్ అంతగా ఎంకరేజ్ చేయరనే టాక్ వినిపిస్తోంది.

ఆ మధ్యను క్రిష్ డైరెక్షన్‌లో కొండపొలం అనే మూవీ వచ్చింది. హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ నటించిన ఈ మూవీ కూడా 'కొండపాలెం' అనే నవల ఆధారంగా తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు అదే కోవకు చెందిన ది గోట్ లైఫ్ మూవీ పరిస్థితి కూడా అలాగే ఉంటుందని అనిపిస్తోంది. టాలీవుడ్‌ దర్శకులు ఈ మూవీని చూసి ప్రశంసించినా తెలుగు ఆడియన్స్ మాత్రం అంతగా మక్కువ చూపరనే సందేహం ఉంది. పైగా ఈ మూవీకి పోటీగా డీజే టిల్లుగాడు వస్తున్నాడు.

డీజే టిల్లు స్క్వేర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ పోటీపడిమరీ రొమాన్స్ చేశారు. సమ్మర్‌లో ఆడియన్స్‌ను కూల్ చేయడానికి ఈ మూవీ వస్తోంది. ఈ క్రేజీ కాంబోపై ఎప్పటి నుంచో ఆడియన్స్ భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కాబట్టి చాలా మంది డీజే టిల్లు స్క్వేర్ వైపే మొగ్గు చూపుతారని, ఆడు జీవితంపై అంతగా ఆసక్తి చూపరని పలువురు అంటున్నారు.

Updated : 27 March 2024 12:05 PM IST
Tags:    
Next Story
Share it
Top