Home > సినిమా > ఎంటర్టైన్‌మెంట్ స్క్వేర్..టిల్లు స్క్వేర్ రివ్యూ

ఎంటర్టైన్‌మెంట్ స్క్వేర్..టిల్లు స్క్వేర్ రివ్యూ

ఎంటర్టైన్‌మెంట్ స్క్వేర్..టిల్లు స్క్వేర్ రివ్యూ
X

రివ్యూ : డిజే టిల్లు స్క్వేర్

తారాగణం : సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్, మురళీధర్ గౌడ్, ప్రిన్స్, మురళీ శర్మ తదితరులు

ఎడిటింగ్ : నవీన్ నూలి

సినిమాటోగ్రఫీ : సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు

మ్యూజిక్ (సాంగ్స్) : రామ్ మిరియాల, శ్రీ చరణ్ పాకాల

బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : భీమ్స్ సిసిరోలియో

నిర్మాతలు : సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య

దర్శకత్వం : మాలిక్ రామ్

2022లో వచ్చిన డిజే టిల్లు సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ మూవీకి అప్పట్లో సిద్ధు జొన్నలగడ్డ ఒన్ మేన్ షోగా నడిపించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అలాంటి మూవీకి సీక్వెల్ అంటే ఖచ్చితంగా అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోవడం కాస్త ఒత్తిడితో కూడిన పనే. పైగా ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ కూడా బిగ్ ఎసెట్ అయింది. ఆ లోటును భర్తీ చేసేందుకు నిన్నటి వరకూ ఫ్యామిలీ హీరోయిన్ అన్న పేరున్న అనుపమతో లిప్ లాక్స్, ఎక్స్ పోజింగ్ చేయించారు.మరి ఇది ఎంత వరకూ వర్కవుట్ అయ్యింది.. ఈ శుక్రవారం విడుదలైన డిజే టిల్లు స్క్వేర్ ఎలా ఉందనేది చూద్దాం.

కథ :

డిజే టిల్లులో రాధిక(నేహాశెట్టి) చేతిలో మోసపోయిన టిల్లు(సిద్ధు).. డిజే బ్యాండ్ పెట్టుకుని మళ్లీ తనదైన లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంటాడు. టిల్లు ఈవెంట్స్ అనే పేరుతో ఫ్యామిలీని కూడా ఇన్వాల్వ్ చేస్తాడు. అలాంటి తన లైఫ్ లోకి లిల్లీ(అనుపమ) వస్తుంది. తనను చూడగానే ప్రేమలో పడతాడు. మనోడి మాటల గారడీకి తనూ పడిపోతుంది. ఇద్దరూ శారీరకంగానూ కలుస్తారు. తర్వాత లిల్లీ సడెన్ గా మాయమైపోతుంది. తన కోసం చూస్తోన్న టైమ్ లో నెల రోజుల తర్వాత ఎదురవుతుంది. తను ప్రెగ్నెంట్ అని చెబుతుంది. మొదట కన్ఫ్యూజ్ అయిన పేరెంట్స్ కోరిక మేరకు పెళ్లి చేసుకునేందుకు ఓకే చెబుతాడు. అదే సమయంలో టిల్లు బర్త్ డే వస్తుంది. అంతకు ముందు బర్త్ డే రోజే చిక్కుల్లో పడ్డట్టు.. ఈ సారి కూడా అదే రిపీట్ అవుతుంది. అతను ఓ ఇంటర్నేషనల్ డాన్ ను చంపాల్సి వస్తుంది. అటు లిల్లీ కూడా సడెన్ గా ట్విస్ట్ లు ఇస్తుంది. మరి ఈ చిక్కుల్లో నుంచి ఈ సారి ఎలా బయటపడ్డాడు..? టిల్లుకు అన్ని సమస్యలు రావడానికి కారణం ఎవరు అనేది మిగతా కథ.

ఎలా ఉంది..?

డిజే టిల్లు స్క్వేర్.. ఫస్ట్ పార్ట్ ఫార్మాట్ లోనే సాగుతుంది. అదే టెంప్లేట్ ను ఫాలో అవుతూ సాగుతుంది. దీంతో ఫస్ట్ హాఫ్ లో కొత్తదనం పెద్దగా కనిపించదు. లిల్లీ అతని లైఫ్ లోకి వచ్చిన తర్వాత కథనం మారుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది. ఈ బ్యాంగ్ వల్ల సెకండ్ హాఫ్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని ఆడియన్స్ ప్రిపేర్ అవుతారు. ఆ ప్రిపరేషన్ కు తగ్గట్టుగానే అక్కడక్కడా కాస్త సాగినట్టు అనిపించినా.. ఓవరాల్ గా ఓ మంచి హిట్ మెటీరియల్ గా అనిపిస్తుంది. ఫస్ట్ పార్ట్ లో కొన్ని సీన్స్ రిపీట్ అవుతూ వస్తున్నప్పుడు ఆడియన్స్ రియాక్షన్ అదిరిపోతుంది. ఫస్ట్ పార్ట్ లో వీరిని బ్లాక్ మెయిల్ చేసిన నర్రా శ్రీనివాస్ వచ్చినప్పుడు.. ముఖ్యంగా రాధిక పాత్ర ఎంటర్ అయినప్పుడు థియేటర్ లో విజిల్సే విజిల్స్. బట్ నేహాతో ఉన్న సీన్ అంత కన్విన్సింగ్ అనిపించదు కానీ.. సాయం కోసం వచ్చిన వారిని కాదనలేని టిల్లు మనస్తత్వాన్ని తెలుపుతుంది. ఇక లిల్లీ పాత్రలో సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ లు అన్నీ ఆకట్టుకుంటాయి.

ఎవరెలా చేశారు..?

డిజే టిల్లు స్క్వేర్.. సిద్ధు జొన్నలగడ్డ ఒన్ మేన్ షో. సినిమా మొత్తం తనే మోశాడు. ముఖ్యంగా అతని డైలాగ్ డెలివరీతో పాటు డైలాగ్స్ అదిరిపోయాయి. ఒకటికి పదిసార్లు చూసుకుని మరీ రాసుకున్నా అని ఇంటర్వ్యూస్ లో చెప్పాడు. అది నిజమే అని ప్రతి సీన్ లో అర్థం అవుతుంది. ఓ టిపికల్ డైలాగ్ డెలివరీయే ఈ సినిమాకు మెయిన్ హైలెట్ అని చెప్పాలి. టిల్లు పాత్రలో అమాయకత్వం, తింగరితనం, తప్పు చేయని తత్వం అన్నిటినీ అద్భుతంగా పలికించాడు సిద్ధు. లిల్లీ పాత్రలో అనుపమ ఇంతకు ముందెప్పుడూ లేనంతగా అందాలారబోసింది. పదికిపైగా లిప్ లాక్స్ తో ఆశ్చర్యపరుస్తుంది. బట్ వీటిలో ఎమోషన్ లేకపోవడంతో చాలా వరకూ ఆర్టిఫిషియల్ గానే అనిపిస్తాయి. ఈ సారి టిల్లు పేరెంట్స్ కు మరింత నిడివి దొరికింది. ఇద్దరూ ఆకట్టుకున్నారు. అలాగే మార్కస్ పాత్రధారీ సెటైర్స్ బాగా వేశాడు. మురళీ శర్మది రొటీన్ రోల్.

టెక్నికల్ గా ..

పాటలు సినిమాకు హైలెట్. ప్రతి పాటా ఆకట్టుకుంటుంది. ఇక నేపథ్యం సంగీతం బ్యాక్ బోన్ లా నిలిచింది. ఈ కంటెంట్ కు తగ్గట్టుగా ఆ ఫంకీనెస్ తో కూడిన ఆర్ఆర్ అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ చాలా బావుంది. ఎడిటింగ్ హైలెట్. కేవలం రెండు గంటల 10 నిమిషాలు మాత్రమే ఉంది సినిమా. డైలాగ్స్ సూపర్బ్. మేకప్, సెట్స్, ఆర్ట్ వర్క్ అన్నీ ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడుగా మాలిక్ రామ్ చాలా జాగ్రత్తగా ఈ కథనం నడిపించాడు. ఎక్కడా తడబడలేదు. ఏ సీన్ లోనూ కథ నుంచి దూరంగా వెళ్లలేదు. అందుకే సినిమా ఆసాంతం ఆకట్టుకుంటుంది.

ఫైనల్ గా : డిజే టిల్లు స్క్వేర్.. సూపర్ ఫన్ రైడ్..

రేటింగ్ : 3/5

- బాబురావు. కామళ్ల.

Updated : 29 March 2024 9:27 AM GMT
Tags:    
Next Story
Share it
Top