Home > సినిమా > vijayakanth: ప్రముఖ నటుడు విజయ్ కాంత్ కన్నుమూత

vijayakanth: ప్రముఖ నటుడు విజయ్ కాంత్ కన్నుమూత

vijayakanth: ప్రముఖ నటుడు విజయ్ కాంత్ కన్నుమూత
X

తమిళనాడు డీఎండీఏ అధినేత, ప్రముఖ నటుడు విజయ్ కాంత్ (vijaykanth) కన్నుమూశారు. ఆయన కోవిడ్ (COVID-19) పాజిటివ్ గా తేలడంతో మంగళవారం ఆసుపత్రిలో చేరారు. వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్న ఆయన పరిస్థితి విషమించి కాసేపటి క్రితమే మరణించారు. ఇదిలా ఉండగా.. ఈ ఉదయమే విజయ కాంత్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని DMDK పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కొన్ని గంటల సమయంలోనే విజయకాంత్ తుది శ్వాస విడిచిపెట్టడంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విజయ్ కాంత్ ఎలాంటి బహిరంగ కార్యక్రమాలు, పార్టీ సమావేశాలకు హాజరుకావడం లేదు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. గత నెల 18న జలుబు, దగ్గు గొంతునొప్పి కారణంగా విజయ్ కాంత్ వైద్య పరీక్షల కోసం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయనకు జలుబు, దగ్గు ఎక్కువగా ఉండటంతో పరీక్షించిన వైద్యులు వెంటిలేటర్ పై శ్వాస అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్య చికిత్సను అందించడంతో నవంబర్ 23న విజయ్ కాంత్.. వైద్యానికి సహకరిస్తున్నట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. చికిత్స తర్వాత ఈనెల 11 న డిశ్చార్జీ చేశారు. డీఎండీకే వర్కింగ్ కమిటీ సాధారణ సమావేశాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. కానీ ఇంతలోనే ఆయన ఆరోగ్యం మళ్లీ విషమించి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

Updated : 28 Dec 2023 9:17 AM IST
Tags:    
Next Story
Share it
Top