Home > సినిమా > Shakeela remuneration : రెండు వారాలకు.. షకీలా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Shakeela remuneration : రెండు వారాలకు.. షకీలా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Shakeela remuneration : రెండు వారాలకు.. షకీలా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
X

బిగ్ బాస్ షో మొదలయిందంటే చాలు.. బుల్లి తెర ఆడియన్స్ టీవీలకు అత్తుకుపోతుంటారు. ఒక్క ఎపిసోడ్ మిస్ అయినా ఓటీటీలో చూసుకుంటారు. అంతగొప్ప ఆడియన్స్ ను సొంతం చేసుకున్న బిగ్ బాస్.. రెండో వారంలోకి అడుగుపెట్టింది. మొదట కాస్త చప్పగా మొదలైన సీజన్.. ఎపిసోడ్ ఎపిసోడ్ కు ఉత్కంఠగా మారుతూ ఆడియెన్స్ కు కావాల్సిన ఎంటర్ టైన్మెంట్ ను ఇస్తుంది. ఎలిమినేషన్ లో భాగంగా రెండో వారం షకీలా హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. అంతా డబ్బుకోసం,ఫేమ్ కోసం, సినిమాల్లో చాన్స్ కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తుంటే.. షకీలా మాత్రం బిగ్ బాస్ హౌస్ ను చూడ్డానికి ఎంట్రీ ఇచ్చిందట. తనకు కాల్ వచ్చిందనే ఒకే ఒక కారణంతో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టినట్లు చెప్పుకొచ్చింది షకీలా.

బిగ్ బాస్ లోకి రావడం షకీలాకు ఒకరకంగా మంచి జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే అప్పటి వరకు శృంగార తారగా గుర్తింపు ఉన్న షకీలా.. ఈ రెండు వారాల్లో బిగ్ బాస్ పుణ్యమా అని అమ్మగా మారింది. హౌస్ లోని వాళ్లంతా అమ్మా అని పిలిచారు. అదే కాదంన్నట్టు పద్దతిగా రెడీ అవుతూ, అందరితో కలుపుగోలుగా ఉంటూ, హస్ పెద్దగా హుందాగా మెదిలింది. దాంతో ఆమెపై ఉన్న అభిప్రాయం మారిపోయింది. అయితే నామినేషన్స్ లో మాత్రం కాస్త తడబడేది. అదే మొదటికి మోసం వచ్చి ఎలిమినేట్ అయ్యేలా చేసింది. రెండు వారాల్లో ఎలిమినేట్ అయినా షకీలా తక్కువేం తీసుకోలేదు. అక్షరాలా వారానికి రూ.3 లక్షల 75 వేలు తీసుకుంది. అంటే రెండు వారాల్లో రూ.7 లక్షల పైమాటే. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు షాక్ అవుతున్నారు. రెండు వారాల్లో 7 లక్షలు సంపాధించిందా అంటూ నోరెళ్లబెడుతున్నారు.

Updated : 18 Sept 2023 6:37 PM IST
Tags:    
Next Story
Share it
Top