Home > సినిమా > Bigg Boss 7 Telugu కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా ..?

Bigg Boss 7 Telugu కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా ..?

Bigg Boss 7 Telugu కంటెస్టెంట్స్ రెమ్యునరేషన్స్ ఎంతో తెలుసా ..?
X

బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు గత ఆదివారం ఘనంగా మొదలయింది. ఇప్పటి వరకు జరిగిన సీజన్‌ల కంటే కొత్తగా ఉంటుందని బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఇదివరకు చెప్పినట్టే షో కొత్తగానే స్టార్ట్ అయ్యింది. సాధారణంగా బిగ్ బాస్‎షోకి ఆదరణ ..అందులో పాల్గొనే కంటెస్టెంట్ల మీదే ఆధారపడి ఉంటుంది. పాపులారిటీ ఉన్నసెలబ్రిటీలు ఉంటే ఆడియెన్స్ చూడటానికి ఇష్టపడతారు. గత సీజన్ ఈ విషయంలో ఫెయిల్ అవడంతో పెద్దగా హిట్ కాలేకపోయింది. అందుకే ఈ సీజన్‎ని కాస్త కొత్తగా ప్లాన్ చేశారు.‘ఉల్టా పుల్టా’ అనే కాన్సెప్ట్‌తో ఉత్సాహంగా నడిపించబోతున్నారు. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం అందకుండా కొత్త కన్సెప్ట్‏తో ఈ సీజన్‌ను నాగార్జున ప్రజెంట్ చేయబోతున్నారు.

ప్రస్తుతం Bigg Boss హౌజ్‎లోకి మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ ఎంటర్ అయ్యారు. జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్‌, సీనియర్ నటుడు శివాజీ , గాయని దామిని భట్ల , ప్రిన్స్ యావర్‌, నటి శుభశ్రీ , షకీలా , ఆట సందీప్ , శోభా శెట్టి , టేస్టీ తేజ , రతిక రోజ్, గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్ , అమర్‌దీప్ చౌదరి షోలో అడుగుపెట్టారు. ఇక వీరిలో కొందరు కొంత ఫెమ్ ఉన్నవాళ్ళు కావడంతో వీరికి ఎంత రెమ్యునరేష్ ఇచ్చారు అనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతుంది . ఇక వీరిలో నటుడిగా, పొలిటికల్‎గా మంచి గుర్తిపును తెచ్చుకున్న శివాజీ కి రెమ్యునరేషన్ ఎక్కువ ఇస్తున్నట్టు తెలుస్తుంది. వీరిలో అతి తక్కువ రెమ్యునరేషన్ రైతు పల్లవి ప్రశాంత్‎కి ఇస్తున్నట్ట్టు సమాచారం. నటుడు శివాజీకి వారానికి 5 లక్షల రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. షకీలా 4 లక్షలు తీసుకుంటుందట. ఇక కిరణ్ రాథోడ్ వారానికి 3 లక్షలు, ఆట సందీప్ 2.50 లక్షలు, ప్రియాంక జైన్ వారానికి2.5 లక్షలు, దామినీ భట్ల 2 లక్షలు, రతికా రోజ్ 2 లక్షలు తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తుంది . కార్తీక దీపంఫేం శోభా శెట్టి 2.25 లక్షలు తీసుకుంటుండగా... పల్లవి ప్రశాంత్ లక్ష మాత్రమే తీసుకుంటున్నాడని సమాచారం. ఇక టెస్టీ తేజ 1.5 లక్షలు తీసుకుంటుండగా. శుభ శ్రీ 2 లక్షలు తీసుకుంటుందట. గౌతమ్ కృష్ణ వారానికి 1.75 లక్షలు తీసుకుంటున్నాడు. ఇక మోడల్, నటుడు ప్రిన్స్ యావర్ 1.5 లక్షలు, అమర్ దీమ్ 2.25 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది .

ఇదిలా ఉంటే వీరిలో ప్రియాంక, శివాజీ, ప్రిన్స్ యావర్,సింగర్ దామినీ, శుభ శ్రీలకు మొదట్లోనే 35 లక్షల రూపాయల ఆఫర్ ఇచ్చినా వెళ్లకుండా ఇక్కడే ఉంటామని స్పష్టం చేశారు. ఇక హౌస్‎లో తొలిరోజు నుంచే కంటెస్టెంట్స్ తమ టాలెంట్ చూపిస్తున్నారు. ఎవరికి వారే ఎక్కువగా హైలైట్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరు హౌజ్‏లో కొంత అతిగా ప్రవర్తిస్తున్నారని ఆడియన్స్ అంటున్నారు. అయితే ఇప్పటికీ రెండు రోజులే అయింది కాబట్టి , ముందు ముందు వీరు ఎలా ఉంటారు , ఎంతవరకు కొనసాగుతారు అనేది తెలియనుంది.

Updated : 5 Sept 2023 4:40 PM IST
Tags:    
Next Story
Share it
Top