Home > సినిమా > మెగాస్టార్ చేతికి ఉన్న వాచ్ ధర తెలిస్తే కళ్లు తేలేస్తారు

మెగాస్టార్ చేతికి ఉన్న వాచ్ ధర తెలిస్తే కళ్లు తేలేస్తారు

మెగాస్టార్ చేతికి ఉన్న వాచ్ ధర తెలిస్తే కళ్లు తేలేస్తారు
X

గురువారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాఖీ పండుగ వేడుకగా జరిగింది. ప్రతి ఇళ్లు ఆడపడుచులతో కళకళలాడింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సెలబ్రిటీలందరూ రాక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లోనూ రాఖీ సందర్భంగా తన సోదురీమణుల రాకతో సందడిగా మారింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చేతికి తన చెల్లెళ్ళు రాఖీలు కడుతున్న వీడియోని నెట్టింట్లో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మెగాస్టార్ ఇంట్లోని పూజా గది స్పష్టంగా కనిపించింది. అంతే కాదు పూజా గదిలో ఉన్న ఫోటోలపైన నెట్టింట్లో హాట్ డిస్కషన్ జరిగింది.




మెగాస్టార్ తన తండ్రి వెంకటరావు, మామ అల్లు రామలింగయ్య ఫోటోలను పూజ గదిలో పెట్టారు. వారిని దేవుళ్లతో సమానంగా ఆయన పూజిస్తున్నారంటూ నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే టైంలో అందరి దృష్టి చిరంజీవి చేయికి ఉన్న రోలెక్స్ వాచ్‎పై పడింది. దాని ధరెంతో తెలుసుకునేందుకు గూగుల్ సెర్చ్ చేశారు. ఇక అంతే ఒక్కొక్కరు కళ్లు తేలేస్తున్నారు. దీంతో ఇప్పుడు చిరంజీవి పెట్టుకున్న వాచ్ హాట్ టాపిక్ అవుతోంది.



మెగాస్టార్ చేతికి ఉన్నది లగ్జరీ బ్రాండ్ రోలెక్స్ కంపెనీకి చెందిన వాచ్. దీని ధరను ఆన్లైన్‎లో చూస్తూ ఏకంగా 2 లక్షల 35 వేల డాలర్లు ఉంది. అంటే ఇండియన్ భారత కరెన్సీ ప్రకారం చూసుకుంటే దాదాపు 2 కోట్ల వరకు ఉంటుంది. ఈ వాచ్ ధర తెలుసుకుని నెటిజన్స్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇంత డబ్బుంటే హైదరాబాద్‎లో ఓ 4 ఇళ్ళు కొనవచ్చు కదా అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్లను ఫోస్ట్ చేస్తున్నారు. మెగాస్టార్ మాత్రమే కాదు దాదాపు స్టార్ హీరోలు, సెలబ్రిటీలు, సినీ తారలు అందరూ అదే విధంగా అంత్యంత లగ్జరీ బట్టలు , వాచ్‎లు,గాడ్జెట్లు, కార్లు వినియోగిస్తుంటారు. అవే నిత్యం సందర్భానుసారంగా నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతుంటాయి.




Updated : 1 Sept 2023 2:53 PM IST
Tags:    
Next Story
Share it
Top