ఎంగేజ్మెంట్లో లావణ్య త్రిపాఠి కట్టుకున్న చీర ధర ఎంతో తెలుసా?
X
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ శుక్రవారం రాత్రి జరిగింది. హైదరాబాద్‌లో నాగబాబు ఇంట్లో అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ లవ్ బర్డ్స్ నిశ్చితార్థం సందడిగా జరిగింది. ఈ కపుల్స్ తమ ఎంగేజ్మెంట్ పిక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. లావణ్యకు మెగా అభిమానులు మెగా కోడలు అంటూ వెల్కమ్ చెప్తున్నారు. ఈ ఏడాది చివర్లోనే వీరి పెళ్లి జరిగే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే ఎంగేజ్మెంట్లో లావణ్య కట్టిన చీర గురించి ఇప్పుడు నెట్టింట్లో చర్చ జరుగుతోంది. ఈమె ధరించిన చీర కాస్ట్ ఎంతో తెలుసుకునేందుకు నెటిజన్స్ ట్రై చేస్తున్నారు. దీంతో చీర ధర కూడా ఇప్పుడు వైరల్‌గా మారింది. సాధారణంగానే సెలబ్రిటీలు, నటీనటులు ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే అధిక ధరలు పలికే వస్త్రాలను, ఆభరణాలను ధరిస్తుంటారు. బ్రాండెడ్ దుస్తులకే ప్రయారిటీ ఇస్తుంటారు. ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్స్ అయితే వారి హంగామా ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో చాలా మంది సెలబ్రిటీలు, హీరోయిన్స్ వారి పెళ్లిళ్లకు , ఫంక్షన్లకు లక్షలలో పలికే దుస్తులు ధరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే తాజాగా ఇప్పుడు లావణ్య త్రిపాఠి తన ఎంగేజ్మెంట్కు కట్టిన చీర ధర కూడా వైరల్‌గా మారింది. మెగా కోడలైనా ఎంతో సింప్లిసిటీని ఫాలో అయ్యింది ఈ సొట్ట బుగ్గల సుందరి. అలంకరణలోనూ చాలా సాధారణంగా కనిపించింది. ఆమె సింప్లిసిటీని చూసి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కోడలంటే ఇలా ఉండాలంటే పొగడ్తలతో ముంచేస్తున్నారు.
వరుణ్‌తో జరిగిన నిశ్చితార్థంలో లావణ్య చిలకపచ్చ రంగు పట్టు చీర కట్టింది. ఈ శారీ ధర ఎంతో తెలుస్తే షాక్ అవుతారు. మెగా కోడలు అవుతున్నా చాలా సింపుల్ గా నిశ్చితార్థానికి రూ. 75 వేల మాత్రమే పలికే బనారసీ పట్టు చీర కట్టుకుంది. ఈ చీరను లావణ్యకు అందించిన ఓ ఫ్యాషన్ డిజైనర్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. లైట్ గ్రీన్ కలర్ లో ఉన్న ఈ పట్టు చీరలో ఎంతో అందంగా కనిపించింది లావణ్య. సింప్లిసిటీతో అందరి మనసులను దోచేసింది.