Home > సినిమా > Bigg Boss 7 విజేత ఎవరో తెలుసా..?తొలివారమే తేలిపోయిందిగా..

Bigg Boss 7 విజేత ఎవరో తెలుసా..?తొలివారమే తేలిపోయిందిగా..

Bigg Boss 7 విజేత ఎవరో తెలుసా..?తొలివారమే తేలిపోయిందిగా..
X

బిగ్ బాస్ సీజన్ -7 ఆసక్తికరంగా సాగుతుంది. తొలివారమే హౌస్ మేట్స్ తామేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తొలివారం నామినేషన్స్ పర్వం హోరాహోరీగా సాగింది. ఇక హౌస్‎లో కొందరు కంటెస్టెంట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అలాంటి వారిలో రతిక రోజ్ ఒకరు . ఈ అమ్మడు తన అందంతో ఆడియెన్స్‎ని ఆకట్టుకుంది. అచ్చ తెలుగు అమ్మాయి అయిన రతిక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్‏లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది .





రతిక అసలు పేరు ప్రియా. మోడల్‎గా తన కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత రతిక రోజ్‎గా తన పేరును మార్చుకుంది. గతంలో స్టాండప్ కమెడియన్ గానూ చేసింది. తనదైన జోక్స్‎తో ప్రేక్షకులను నవ్వించి మెప్పించింది. ఇక మోడలింగ్ చేస్తూనే సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. బెల్లంకొండ గణేష్ నటించిన నేను స్టూడెంట్ సార్ సినిమాలో పోలీస్ పాత్రలో కనిపించింది రతిక. ఇక ఇప్పుడు బిగ్ బాస్‎లో ఛాన్స్ దక్కించుకుంది. ఇక హౌస్‎లో అడుగుపెట్టిన తర్వాత తన తెలుగు అందంతో ఆకట్టుకుంటుంది. అలాగే రతిక రోజ్ గొడవలకు వేదిక అవుతూ హౌస్‎లో హీట్ పెంచుతోంది. బిగ్ బాస్ తనకిచ్చిన సీక్రెట్ టాస్క్‎ను తెలివిగా పూర్తి చేసి తన స్ట్రాటజీ ఏంటో చూపించింది. తన ప్లాన్‎ను పర్ఫెక్ట్‎గా అమలు చేసి ఆడియన్స్ మనసును గెలుచుకుంది. రతిక మొదటిరోజు నుండి తనపై ఆడియన్స్ చూపు పడేలా చేసుకుంటుంది. హౌస్‎లోకి ఎంటర్ కాకముందు స్టేజ్‎పై నాగార్జునతో మాట్లాడినప్పుడు కూడా తడబడకుండా దైర్యంగా మాట్లాడింది రతిక.





టాలీవుడ్‎లో పలు సినిమాల్లో నటించినా ఈ అమ్మడికి సరైన గుర్తింపు లభించలేదు. అందుకే తానేంటో ప్రూవ్ చేసుకోవడానికి బిగ్ బాస్ సీజన్ 7కు వచ్చింది . ఇప్పటికే ఆడియన్స్ లో రతికపై పాజిటీవ్ ఒపీనియన్ వచ్చేసింది. దీంతో రతిక విన్నెర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక రతిక గురించి బయట మరో టాక్ కూడా వినిపిస్తుంది. ఈ సీజన్ విన్నర్‎గా రతికా రోజ్‎ను డిసైడ్ చేసేశారని. ఆ విషయం ఆమెకు కూడా తెలుసని, అందుకే ధీమాగా ఉంటోందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ముందే విన్నర్‎ను డిసైడ్ చేసే అవకాశాలు దాదాపు ఉండవు. కానీ రతిక తన ఆటతీరుతో ఆకట్టుకుంటే మాత్రం విన్నర్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే తనలోని గ్లామర్ సరికొత్తగా చూపిస్తే హీరోయిన్ గా కూడా అవకాశాలు అందుకోవచ్చు.




Updated : 6 Sep 2023 9:10 AM GMT
Tags:    
Next Story
Share it
Top