సౌత్ లో అందరికంటే రిచ్చెస్ట్ హీరో అతనే.
X
సౌత్ లో మనకు చాలా పెద్ద హీరోలే ఉన్నారు. తెలుగు, తమిళ, మలయాళం అన్నింటిలోనో సూపర్ స్టార్స్ ఉన్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఈ స్టార్స్ సినిమా కోట్లలోనే బిజినెస్ అవుతుంది. దానికి తోడు యాడ్స్ మిగతా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దాని వలన కూడా చాలా డబ్బులు వస్తూ ఉంటాయి. అసలు వాళ్ళు ఒక్కో సినిమాకు తీసుకున్న రెమ్యునరేషనే చాలా ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ అంటే వాళ్ళు ఒక సినిమాకు సంపాదించిన దాంతో కొన్ని పేద కుటుంబాలు జీవితాంతం కూడా బతికేయగలుగుతాయి. అయితే వీళ్ళందరిలోనూ మళ్ళీ ఎక్కువ, తక్కువలు ఉన్నాయి. అవే లెక్కలు వేస్తే....స్టార్లందరిలోనూ ఒక హీరో మాత్రం చాలా ఎక్కువ సంపాదిస్తున్నారని తెలిసింది. ఆ హీరో ఎవరో మీకు తెలుసా....
సౌత్ లో...అందులో తెలుగు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ నాగార్జున. ముప్పై ఏళ్ళ యాక్టింగ్ కెరీర్ ఉన్న నాగార్జున ఫ్యామిలీ అంతా ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉంది. ఆయన తండ్రి నాగేశ్వర్రావు నుంచి వాళ్ళు యాక్టింగ్ లో ఉన్నారు. అంతేకాదు ఏఎన్నార్, నాగార్జున, మిగతా వాళ్ళు వ్యాపారం లో కూడా రాణిస్తున్నారు. నాగార్జున నటన, యాడ్సే కాకుండా...టీవీ షో కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన నికర ఆస్తుల విలువ 3వేల కోట్ల రూపాయలు ఉంటుందని సర్వే. జౌమ్ టీవీ నివేదిక ప్రకారం 2022లో నాగ్ ఆస్తుల విలువ 3010 కోట్లకు పైమాటే. అందుకే సౌత్ ఇండియాలోని హీరోల్లో నాగార్జున అత్యంత ధనవంతుడు అని చెబుతున్నారు.
ఇక నాగార్జున తర్వాత స్థానాల్లో వెంకటేష్, చిరంజీవి ఉన్నారు. వెంకటేష్ 2200కోట్లు అయితే చిరు ఆస్తుల నిక విలువ 1650 కోట్లు. వీళ్ళ తర్వాత 1370 కోట్ల రూపాయలతో రామ్ చరణ్ నాలుగో స్థానంలో ఉన్నారు. జూ.ఎన్టీయార్ 450 కోట్లు, దళపతి విజయ్ 445 కోట్లు, రజనీకాంత్ 430 కోట్లు, కమల్ హాసన్ 388 కోట్లు, మోహన్ లాల్ 376 కోట్లు, అల్లు అర్జున్ 350 కోట్లు ఉన్నాయి.