Home > సినిమా > సురేష్ కొండేటి తప్పు చేస్తే చిరంజీవికేం సంబంధం

సురేష్ కొండేటి తప్పు చేస్తే చిరంజీవికేం సంబంధం

సురేష్ కొండేటి తప్పు చేస్తే చిరంజీవికేం సంబంధం
X

ఇండస్ట్రీలో మోస్ట్ కాంట్రవర్శీయల్ అని చెప్పలేం కానీ.. మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ ఫిల్మ్ జర్నలిస్ట్ అంటే ఖచ్చితంగా చాలా వేళ్లు సురేష్ కొండేటి వైపు చూపిస్తాయి. ప్రెస్ మీట్స్ లో అతను అడిగే తలా తోకా లేని ప్రశ్నలకు సెలబ్రిటీస్ ఇరిటేట్ అవుతుంటారు. చాలామంది ఆ చిరాకును ఓపెన్ గానే ప్రదర్శిస్తారు. అప్పుడప్పుడే జర్నలిజంలోకి వచ్చిన వాళ్లు కూడా అంత ఇమెచ్యూర్ ప్రశ్నలు అడగరు. పైగా అడిగే విధానం కూడా తనే వారిని పోషిస్తున్నట్టుగా ఉంటున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ జర్నలిస్ట్ పై సోషల్ మీడియాలో చాలామంది దారుణమైన ట్రోల్స్, విమర్శలు చేస్తుంటారు. అయినా అతను మారడు. సీనియర్ మోస్ట్ సినిమా జర్నలిస్ట్ గా చెప్పుకునే ఇతను చాలాకాలంగా ‘సంతోషం’ అనే ఒక మాగజిన్ ను నడిపిస్తున్నాడు. ఆ పత్రిక తరఫునే ప్రెస్ మీట్స్ కు అటెండ్ అవుతుంటాడు. ఇక ఈ పత్రిక పేరుమీదుగానే తను కొన్నేళ్లుగా అవార్డులు ఇస్తున్నాడు. ఈ అవార్డ్స్ ను మెగాస్టార్ నుంచి మినీస్టార్ వరకూ అందుకున్నవారే. ఈ పరిచయాలతోనే సదరు సురేష్ కొండేటి అనే వ్యక్తి చిరంజీవి ఫ్యామిలీ హీరోలు వచ్చినప్పుడు పబ్లిక్ ప్లేసెస్ లో కాస్త హడావిడీ చేస్తుంటాడు.అప్పుడప్పుడూ బౌన్సర్ గానూ అవతారం ఎత్తుతాడు. ఇదంతా ఓవరాక్షన్ అని తోటి జర్నలిస్ట్ లకు తెలుసు. అయినా ఇండస్ట్రీలో ఇలాంటి ‘జోకుడు’ వ్యవహారాలు కామన్ కాబట్టి ఎవరూ పెద్దగా పట్టించుకోరు. బట్ శృతి మించితే ఏదైనా ఇష్యూ అవుతుందన్నట్టుగా.. అతని వల్ల ఇప్పుడు మెగాస్టార్ కు సౌత్ ఇండస్ట్రీలోనే చెడ్డపేరు స్టార్ట్ అయింది.

సురేష్ కొండేటి తన పత్రిక పేరుమీదుగా ఇచ్చే అవార్డ్స్ ను విస్తరించాలనుకున్నాడు. ఈ మేరకు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ లోని ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కు కూడా అవార్డ్ అందిచాలనుకున్నాడు. ఇందుకోసం మొదటిసారిగా గోవాను వేదిక చేసుకున్నాడు. మరి మ్యాన్ పవర్ సరిపోకనో లేక ఇంకేదైనా కారణాల వల్లనో అతను ఆ ఫంక్షన్ ను అనుకున్న రీతిలో నిర్వహించడంలో విఫలమయ్యాడు. దీంతో మిగతా భాషల నటీనటులు, టెక్నీషియన్స్ అంతా.. చిరంజీవి పిఆర్వో అయిన సురేష్ కొండేటి మమ్మల్ని అవమానించాడు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు మొదలుపెట్టారు. ఈ విషయం అల్లు అరవింద్ కు తెలిసి సురేష్ కొండేటి పేరు తీయకుండానే ‘‘అతనికీ మెగా ఫ్యామిలీలో ఏ హీరోకూ సంబంధం లేదని.. ఏదో పబ్లిక్ ఫంక్షన్స్ లో హడావిడీ చేయడమే తప్ప.. అతనెప్పుడూ మా ఫ్యామిలీలోని ఏ హీరోకూ పిఆర్వోగా పనిచేయలేదని.. అతని వ్యక్తిగత వైఫల్యాన్ని తెలుగు సినిమా పరిశ్రమ వైఫల్యంగా చూడటం తప్పని..’’ చెబుతూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

నిజానికి సురేష్ కొండేటి తనను తాను అలా పరిచయం చేసుకోకుంటే లేదా ఇంకెవరైనా అతన్ని అలా పరిచయం చేయకుంటే ఈ వ్యక్తి మెగాస్టార్ కు పిఆర్వో అన్న విషయం ఆ భాషల వారికి ఎలా తెలుస్తుందనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం అందరికీ తెలుసు. ఏదేమైనా అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టుగా ప్రతిదానికీ ఒక టైమ్ వస్తుంది. అప్పుడు మన టైమ్ అయిపోతుంది అనేదానికి అప్పుడప్పుడూ జరిగే సంఘటనలే ఉదాహరణ. తన వ్యక్తిగత వైఫల్యంతో ఎంతోమంది ‘సంతోషం’ను దూరం చేశాడు సదరు సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్.

Updated : 4 Dec 2023 10:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top