Home > సినిమా > Double Ismart : డబుల ఇస్మార్ట్ కు త్రిపుల్ కష్టాలు

Double Ismart : డబుల ఇస్మార్ట్ కు త్రిపుల్ కష్టాలు

Double Ismart  : డబుల ఇస్మార్ట్ కు త్రిపుల్ కష్టాలు
X

(Double Ismart) హిట్ ఉంటేనే ఇండస్ట్రీలో గౌరవం. వ్యక్తిత్వం నచ్చేవాళ్లు తక్కువగా ఉంటారు కాబట్టి వాళ్లెప్పుడూ గౌరవిస్తారు. బట్ ఇతర జనం మాత్రం విజయాలను బట్టే చూస్తారు. ప్రస్తుతం ఈ విషయంలో ఎక్కడో ఉన్న పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కలిసి సినిమా చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం వీళ్లే ఇస్మార్ట్ శంకర్ అనే సిల్లీ సినిమాతో హిట్ కొట్టారు. హిట్ కొట్టాక సిల్లీ అంటారేంటీ చిప్ దొబ్బిందా అనిపిస్తోంది కదా.. నిజమే.. ఆ సినిమాలో చిప్ నే దొబ్బారు. ఆ కాన్సెప్ట్ తోనే బాక్సాఫీస్ ను గెలిచారు. అయినా పూరీ జగన్నాథ్ సినిమా అంటే అమ్మాయిలను ఏడిపిస్తూ అడ్డగోలుగా కనిపిస్తే సరిపోతుంది కదా.. అదే చేశాడు.. ఇస్మార్ట్ శంకర్ లో. ప్రస్తుతం దీనికి సీక్వెల్ అంటూ వస్తున్నారీ ఇద్దరు. బట్ ఈ డబుల్ కు త్రిబుల్ కష్టాలు మొదలయ్యాయి. అసలే కొనేవాళ్లు లేరురా బాబూ అంటే కొన్న తర్వాత కూడా కొత్త కష్టాలు ఎదురుచూస్తున్నాయట.

రామ్ పోతినేని.. 2006లో దేవదాసుతో కెరీర్ మొదలుపెట్టాడు. ఇన్నేళ్లలో 20కి పైగా సినిమాలు చేశాడు. మరి వీటిలో విజయాలు ఎన్ని అంటే నాలుగైదు మాత్రమే. అయినా టైర్ టూ హీరోల లిస్ట్ లో చేరాడు. 2016లో నేను శైలజ, 2019లో ఇస్మార్ట్ శంకర్ తో కమర్షియల్ హిట్స్ అందుకున్నాడు. నేను శైలజ తర్వాత, ఇస్మార్ట్ తర్వాత వరుసగా హ్యాట్రిక్ డిజాస్టర్స్ ఉన్నాయి. అయినా రీసెంట్ గా అతను 25 కోట్లు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడనే వార్తలు రావడం విశేషం. సరే.. రెమ్యూనరేషన్ నిర్మాతలు ఇచ్చుకుంటారు కనక మనకు అనవసరం. స్కంద వంటి ఆణిముత్యం తర్వాత అతను మరోసారి పూరీ జగన్నాథ్ తో ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు. అప్పుడు హిట్ అయిన ఇస్మార్ట్ శంకర్ ను ఇప్పుడుచూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఇలాంటి చిప్ దొబ్బిన సినిమా ఎలా ఆడిందా అనే డౌట్ కూడా వస్తుంది. ఇక పూరీ జగన్నాథ్ కూడా తన హీరోలను ఇంకా ఇడియట్స్, రోగ్స్, లోఫర్స్ గానే చూపిస్తున్నాడు. అతను మారడనే జనం కూడా పూరీ సినిమాలను లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇతగాడికీ ఇస్మార్ట్ కు ముందు 2012లో బిజినెస్ మేన్ 2015లో చేసిన టెంపర్ సినిమాలు మాత్రమే పూరీ మార్క్ ను చూపించాయి. మిగతావన్నీ అతను ఆడియన్స్ ను లైట్ తీసుకుని ఏం తీసినా చూస్తారు అనే నిర్లక్ష్యంతోనే రూపొందించినట్టుగానే కనిపిస్తాయి. అందుకే ఒకప్పుడు పూరీ సినిమా అంటే ఎగబడి చూసిన జనం ఇప్పుడు లైట్ తీసుకుంటున్నారు. చివరగా వచ్చిన లైగర్ తో మనోడిలో మేటర్ పూర్తిగా అయిపోయిందని తేలిపోయింది. అయినా డబుల్ ఇస్మార్ట్ అంటూ వస్తున్నాడు. మార్చి 8న విడుదల అని చాలాకాలం క్రితమే ప్రకటించిన ఈ చిత్రాన్ని కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. దీనికి తోడు చాలా ఫైనాన్సియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయని.. అదీ చాలదన్నట్టు హీరో దర్శకుడి పనిలో వేలు పెట్టాడనీ రకరకాల రూమర్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం సినిమాకు బిజినెస్ పెద్ద ప్రాబ్లమ్ అయింది. మణిశర్మ వల్ల ఆడియో రైట్స్ మాత్రం అమ్ముడయ్యాయి. బట్ సినిమా కావాలని బయ్యర్స్ ఎవరూ ధైర్యం చేయడం లేదట. అదీ కాంబినేషన్ పవర్ అనుకోవచ్చు. ఇక ఒకవేళ ఎవరైనా కొన్నా కూడా.. వెంటనే తమ బకాయిలు లాక్కోవాలని గతంలో అప్పులు ఇచ్చినవాళ్లు ఎదురుచూస్తున్నారట. మొత్తంగా డిజాస్టరస్ కాంబోలో వస్తోన్న ఈ డబుల్ ఇస్మార్ట్ కు టైటిల్ మించిన కష్టాలు వెంటాడుతున్నాయి. మరి ఈ కష్టాల నుంచి ఇస్మార్ట్ గా తప్పించుకుంటారా లేక ఇరుక్కుంటారా అనేది చూడాలి.. దానికంటే ముందు అసలు డబుల్ ఇస్మార్ట్ ముందు చెప్పినట్టు మార్చి 8న విడుదలవుతుందా .. అనేదే అసలు ప్రశ్న ఇప్పుడు.


Updated : 5 Feb 2024 12:14 PM GMT
Tags:    
Next Story
Share it
Top