Drishyam : దృశ్యం ఖాతాలో మరో ఘనత..తొలి భారతీయ చిత్రంగా రికార్డు
X
దృశ్యం సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో మనందరికి తెలిసిందే. ఇప్పటికే మలయాళ, తెలుగు, హిందీ భాషల్లో సూపర్ హిట్టు కొట్టిన దృశ్యం మూవీ పలు రికార్డులను సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు రీమేక్‌లలో కూడా మరో ఘనత సాధించింది. ఏకంగా హాలీవుడ్ ప్రొడక్షన్ యూనిట్ ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, స్పానిష్‌లలో రీమేక్ చేయనున్నట్లు తెలిపింది. దీంతో హాలీవుడ్‌లో రీమేక్ కానున్న మొదటి ఇండియా మూవీగా ‘దృశ్యం’ నిలిచింది.
ఫస్ట్ మోహన్ లాల్ హీరోగా మలయాళంలో దృశ్యం రూపొందింది. తర్వాత అదే పేరుతో తెలుగు, హిందీలో, ‘దృశ్య’ పేరుతో కన్నడలో, ‘పాపనాశం’ పేరుతో తమిళ్‌లో తెరకెక్కి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘దృశ్యం 2’ కూడా ఘన విజయం సాధించింది. దీంతో ఈ సిరీస్ చిత్రాల కథలు కొరియన్‌లో రీమేక్ చేశారు. కొరియన్ లో కూడా ఈ సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తాజాగా హాలీవుడ్‌లో పాపులర్ అయిన గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ సంస్థతో కలిసి ‘దృశ్యం’ కథలను హాలీవుడ్ లో రీలిజ్ చేయనుంది. ఇండియన్ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ నుంచి ఈ మూవీస్ ఇంటర్నెషనల్ రీమేక్ హక్కులను ఆ సంస్థ సొంతం చేసుకుంది. అయితే హలీవుడ్ ‘దృశ్యం’లో నటీనటులుగా ఎవరు కనిపించనున్నారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే మలయాళంలో ‘దృశ్యం 3’ రానుంది.