Home > సినిమా > సినిమాల్లోకి రావడానికి చాలా భయపడ్డాను-దుల్కర్ సల్మాన్

సినిమాల్లోకి రావడానికి చాలా భయపడ్డాను-దుల్కర్ సల్మాన్

సినిమాల్లోకి రావడానికి చాలా భయపడ్డాను-దుల్కర్ సల్మాన్
X

గన్స్ అండ్ గులాబ్స్ సీరీస్ రేపు నెట్ ఫ్లిక్స్ లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఇందులో నటించిన దుల్కర్ సల్మాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని బోలెడు విషయాలు పంచుకున్నారు.మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్. మహానటి, సీతారామం సినిమాలతో ఇతను తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు. దుల్కర్ అంటే చాలా మంది అమ్మాయిలు పడిచచ్చిపోతారంటే అతిశయోక్తి కాదేమో కూడా. దుల్కర్ సల్మాన్ తన కెరీర్ పీక్ లో ఉన్నారు. చేతి నిండా సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీబిజీగా ఉన్నారు. ఇతను నటించిన గన్స్ అండ్ గులాబ్స్ రేపు నెట్ ఫ్లిక్స్ లో విడుదల అవుతోంది. అయితే దుల్కర్ మొదట సినిమాల్లోకి రావడానికి చాలా భయపడ్డారుట. ఇండస్ట్రీలో తనకు ఇష్టమైన నటులు చాలామంది ఉన్నారని...అయితే ఎవరు ఏం చేసినా...ఇంకా బాగా నటించొచ్చు అనిపించేదిట. ప్రేక్షకులు అందరూ అలాగే అనుకుంటారని దుల్కర్ అభిప్రాయం. తాను సినిమాల్లోకి వస్తే...తన గురించి కూడా అలాగే అనుకుంటారు కదా అని ఆలోచించారుట. అందుకే సినిమాల్లోకి రావడానికి భయపడ్డాను అని చెబుతున్నారు దుల్కర్.

ప్రేక్షకుల వరకు ఎందుకు నటీనటులకే వాళ్ళు నటించిన సినిమాలు కొన్నాళ్ళ తర్వాత చూసుకుంటే ఇంకా బాగా నటించొచ్చు అనిపిస్తుందని చెప్నుకొచ్చారు దుల్కర్. తన కెరీర్ మొదట్లో చేసిన సినిమాలు తనకు నచ్చవని కూడా చెప్పుకొచ్చారు. ఇంకా బాగా చేసుండాల్సింది అనుకుంటాను అంటున్నారు. అంతేకాదు నాకు మానాన్న సినిమాలంటే చాలా ఇష్టం అని చెబుతున్నారు. ఆయనలా ఎదగాలని అనుకుంటున్నానని చెప్పారు దుల్కర్.

రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో గన్స్ అండ్ గులాబ్స్ తెరకెక్కింది. దీని గురించి దుల్కర్ మాట్లాడుతూ...రాజ్, డీకే ఇద్దరూ మంచి రచయితలను మెచ్చుకున్నారు. సిరీస్ షూటింగ్ టైమ్ అంతా సరదాగా గడిచిపోయిందని చెప్పారు.

Updated : 17 Aug 2023 9:09 PM IST
Tags:    
Next Story
Share it
Top