Dunki Drop 4 Trailer, : తుఫాన్ లా సలార్.. తుంపరలా డంకీ
X
షారుఖ్ ఖాన్, ప్రభాస్.. ఇద్దరూ పెద్ద హీరోలు. షారుఖ్ ఈ యేడాది రెండు సినిమాలతో రెండు వేల కోట్లు కొల్లగొట్టి ఇండియన్ హిస్టరీలోనే ఇప్పట్లో ఎవరికీ సాధ్యం కాని రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రభాస్.. బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియన్ స్టార్ గా తిరుగులేని మార్కెట్ తో పాటు క్రేజ్ ను సంపాదించుకున్నాడు. బట్ ఆ రేంజ్ లో ఆ తర్వాతి సినిమాలు సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ కనిపించలేదు. అయినా అతని రేంజ్ మారలేదు. క్రేజ్ తగ్గలేదు. ఇంకా డబుల్ అవుతుందీ అనేలా కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తో సలార్ మూవీతో రాబోతున్నాడు. ఈ నెల 22న సలార్ విడుదల కాబోతోంది. అదే రోజు షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీల డంకీ విడుదల కావాల్సి ఉంది. రెండు పెద్ద సినిమాల మధ్య క్లాష్ ఎందుకని డంకీని 21న విడుదల చేస్తున్నారు. ఇక రీసెంట్ గా వచ్చిన సలార్ మూవీ ట్రైలర్ తుఫాన్ లా కనిపించింది. లేటెస్ట్ గా డంకీ ట్రైలర్ విడుదలైంది. ఇది మాత్రం తుంపరగా మొదలై తుఫాన్ లా మారినట్టుగా కనిపిస్తోంది.
సలార్ ట్రైలర్ చూస్తే అవుట్ అండ్ అవుట్ ఊరమాస్ ఎంటర్టైనర్ లా ఉంది. డంకీ మాత్రం సన్నని తుంపరలా మొదలై.. మెల్లగా ఎమోషనల్ టచ్ తో ఒక విధ్వంసంతో కూడిన ఎంటర్టైనర్ లా కనిపిస్తోంది. రెండు ట్రైలర్స్ పూర్తిగా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇంకా చెబితే ఈ రెండు సినిమాలూ పూర్తిగా ఆయా దర్శకుల శైలిలో ఉన్నాయి. హీరోల ఇమేజ్ లకు భిన్నమైన కంటెంట్స్ తో కనిపిస్తున్నాయి.
ఇక డంకీ ట్రైలర్ చూస్తే పంజాబ్ కు చెందిన కొందరు స్నేహితులు అమెరికా వెళ్లాలనుకుంటారు. అక్కడికి వెళ్లాలంటే ఇంగ్లీష్ రావాలి కదా.. అందుకోసం గల్లీల్లో ఇంగ్లీష్ నేర్పించే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ల్లో చేరతారు. వాళ్లు నేర్పిందే భాష అనుకుని వెళితే వీరి ఆంగ్ల పరిజ్ఞానానికి వీసా రాదు. అయినా అమెరికా వెళ్లాలని దొడ్డిదారిలో ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో అనేక సవాళ్లు ఎదుర్కొంటారు. చుట్టుపక్కల దేశాల సైన్యానికి చిక్కుతారు. అక్కడి నుంచి తప్పించుకుని మళ్లీ ఇండియాకు వచ్చారా లేదా అనేదే కథలా కనిపిస్తోంది. షారుఖ్ ఖాన్ తో పాటు తాప్సీ, బొమన్ ఇరానీ, విక్కీ కౌశల్ కీలక పాత్రల్లో నటించారు.
రాజ్ కుమార్ హిరాణీ సినిమాలన్నీ హ్యూమన్ ఎమోషన్స్ తో నిండి ఉంటాయి. ఇప్పటి వరకూ మనం చూడని కొత్త కోణాలను అతను టచ్ చేస్తాడు. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక థాట్ ప్రోవోకింగ్ కంటెంట్స్ తోనే వస్తాడు. అలాంటి దర్శకుడు ఫస్ట్ టైమ్ షారుఖ్ తో సినిమా చేస్తున్నాడు అన్నప్పుడు అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. దీనికి తోడు షారుఖ్ ఇప్పటికే పఠాన్, జవాన్ అంటూ రెండు ఊరమాస్ ఎంటర్టైనర్స్ తో ఒక్కో మూవీతో వెయ్యికోట్ల కలెక్షన్స్ కొల్లగొట్టి ఊపులో ఉన్నాడు. మళ్లీ మాస్ మూవీ అయితే ఆడియన్స్ కు మొనాటనీ వస్తుంది. అందుకే కొత్త కంటెంట్ కాబట్టి డంకీ ట్రైలర్ కాస్త స్లో పేజ్ లో కనిపిస్తున్నా.. సలార్ ట్రైలర్ కు ధీటుగానే కనిపిస్తోంది.
సలార్ ట్రైలర్ తుఫాన్ లా దూకుడుగా ఉంది. పైగా ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉంది. డంకీ మాత్రం తుంపరలా కాస్త హాయిగానే కనిపిస్తోంది. సో.. ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీయే ఉండబోతోందనుకోవచ్చు. మరి ఈ కాంపిటీషన్ లో బాక్సాఫీస్ వద్ద ఖలేజా చూపించి కమర్షియల్ గా ఎవరు తోపు అనిపించుకుంటారో చూడాలి.