Home > సినిమా > డంకీ కలెక్షన్స్ .. షారుఖ్ కు పెద్ద అవమానం

డంకీ కలెక్షన్స్ .. షారుఖ్ కు పెద్ద అవమానం

డంకీ కలెక్షన్స్ .. షారుఖ్ కు పెద్ద అవమానం
X

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఈ యేడాది ఇప్పటి వరకూ ఇండియన్ హిస్టరీలోనే ఏ హీరో సాధించని రేర్ రికార్డ్ సాధించాడు. పఠాన్, జవాన్ సినిమాలు వరుసగా వెయ్యి కోట్ల రూపాయలు సాధించాయి. దీంతో అతని డంకీపై భారీ అంచనాలున్నాయి అనుకున్నారు. రాజ్ కుమార్ హిరాణీ దర్శకుడు కావడంతో మరింత పెరిగాయి. బట్ వీరి ప్రమోషనల్ స్ట్రాటజీస్ తో పాటు ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్ పెక్టేషన్స్ తగ్గాయి అనేది నిజం. మరోవైపు సలార్ తో పోటీ ఉండటం కూడా మైనస్ అయింది.ఈ గురువారం విడుదలైన డంకీకి ఫస్ట్ డే కలెక్షన్స్ చూసిన ట్రేడ్ అనలిస్ట్ లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఒకే యేడాది ఇంత పెద్ద మార్పు ఎలా ఉంటుంది.. ఇంత షాక్ కు కారణమేంటీ అని విశ్లేషణలు చేస్తున్నారు.

జవాన్ మూవీకి మొదటి రోజు కలెక్షన్స్ ఏకంగా 100 కోట్లు వచ్చాయి. ఇది షారుఖ్ కు హయ్యొస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. ఈ మూవీ క్రేజ్ వల్ల జవాన్ కు మరింత క్రేజ్ వచ్చింది. ప్రమోషన్స్ తో పాటు ట్రైలర్ కూడా చూసిన తర్వాత దేశవ్యాప్తంగా జవాన్ కు తిరుగులేని బజ్ క్రియేట్ అయింది. ఆ బజ్ తోనే ఈ మూవీ కూడా ఫస్ట్ డే ఏకంగా 145 కోట్లు కొల్లగొట్టి ఆల్ టైమ్ బెస్ట్ ఓపెనర్ గా రికార్డ్స్ క్రియేట్ చేసింది. దీంతో డంకీ కూడా మాగ్జిమం ఓపెనింగ్స్ తెచ్చుకుంటుందని భావించారు. బట్ డంకీ మూవీ టీమ్ తో పాటు షారుఖ్ ఖాన్ కు కూడా షాక్ ఇచ్చింది.

డంకీ సినిమాకు ఇండియాలో ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ కేవలం 30.27 కోట్లు మాత్రమే. సలార్ ను ఇబ్బంది పెట్టాలని చాలా థియేటర్స్ వీళ్లే ఆక్యుపై చేశారు. నార్త్ లో మల్టీప్లెక్స్ లు అన్నీ డంకీకే కేటాయించారు. దీని వల్ల ప్రభాస్ సినిమా ఓపెనింగ్స్ ను దెబ్బ కొట్టాలని చూశారు. ఈ విషయంపై నేషనల్ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ఇన్ని చేసినా ఈ యేడాది రెండు వేల కోట్లు కొల్లగొట్టిన షారుఖ్ సినిమా కేవలం 30 కోట్లు మాత్రమే ఓపెనింగ్ రూపంలో తెచ్చుకోవడం నిజంగా షాకే. ఇతర దేశాల్లోని కలెక్షన్స్ కూడా కలుపుకుంటే ఓవరాల్ గా 57.43 కోట్లు ఓపెనింగ్స్ తెచ్చుకుందీ మూవీ.

అయితే ఒక రకంగా ఇది డీసెంట్ ఓపెనింగ్ అనే చెప్పాలి. కాకపోతే రెండు బ్లాక్ బస్టర్స్ తర్వాత వచ్చిన సినిమా కావడం, ఆ రెండూ భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోవడం వల్ల కంపేరిజన్ చేస్తున్నారు. అలా కంపేర్ చేస్తే డంకీ ఓపెనింగ్స్ చాలా డల్ అనే చెప్పాలి.

Updated : 22 Dec 2023 5:09 PM IST
Tags:    
Next Story
Share it
Top