Dunki twitter Review:'డంకీ'.. ఎవర్‌గ్రీన్ మాస్టర్ పీస్.. బాద్‌షా నటన అద్భుతం
X
పఠాన్, జవాన్ మూవీలతో ఈ ఏడాది రెండు వేల కోట్లకు పైగా కొల్లగొట్టిన బాలీవుడ్ బాద్ షా... ఇయర్ ఎండ్‌లో మరో సంచలన హిట్టు కొట్టాడు. సెన్సిబుల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ కాంబోలో తెరకెక్కిన డంకీ సినిమా ఈరోజు ఈరోజు (డిసెంబర్ 21) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. థియేటర్లలో ఇప్పటికే ఈ సినిమాను(ప్రీమియర్ షోస్ ) చూసిన, చూస్తున్న జనాలు.. సోషల్ మీడియా వేదికగా రివ్యూ ఇచ్చేస్తున్నారు. కింగ్ ఖాన్ ఖాతాలో మరో 1000 కోట్ల సినిమా పడిందని అంటున్నారు. ఈ ఏడాది బాద్‌షా హ్యాట్రిక్ కొట్టాడని, డంకీ ఓ మాస్టర్ పీస్ అని కొనియాడుతున్నారు. షారుక్ ఖాన్ నటన అద్భుతమని కొనియాడారు. దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వ శైలి గురించి కూడా మాట్లాడుతున్నారు. మరోసారి ఆయన తన మేజిక్ రిపీట్ చేశారని, సినిమా అద్భుతంగా తీశారని పేర్కొన్నారు.
#DunkiReview Raju sir + SRKs = Another 1000 cr Mark my work...
— AbRam Khan (@iAmDilshad07) December 21, 2023
What a movie man...Theater me bina rumaal aur tissue paper ke mat jana
⭐⭐⭐⭐⭐#Dunki #DunkiFirstDayFirstShow #RajkumarHirani #ShahRukhKhan pic.twitter.com/7TpZdfcsXB
ఫస్ట్ హాఫ్ ఫుల్ ఆఫ్ కామెడీ అని, రెండో భాగం ఫుల్ ఆఫ్ ఎమోషన్స్‌తో సాగిందని అంటున్నారు నెటిజన్స్. హిరానీ మ్యాజిక్, షారుఖ్ ఖాన్ జస్ట్ వావ్ అంటూ పొగిడేస్తున్నారు. డంకీ సినిమా ఆడియన్స్ కు సరికొత్త కొత్త అనుభూతి కలిగించిందని, యాక్షన్ సీన్స్‌లో షారుఖ్ అదరగొట్టేశాడని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
One word - Masterpiece 🔥
— Aman 🇵🇱 (@AJSRKIAN7) December 20, 2023
Dunki is a groundbreaking Bollywood movie that is released ahead of its time. This film is a comedy with great acting, unique characters, a complex plot, and, most importantly, a very inspiring film about choosing the correct route in life.
The film's…
అద్భుతంగా ఉన్న కథను దర్శకుడు ఇంకా అద్భుతంగా తెరకెక్కించాడంటూ ట్వీట్ చేశారు. సినిమా అయిపోయే వరకూ సీట్లకు అతుక్కు పోయామని.. షారుఖ్ తో సహా తాప్సీ, విక్కి కౌశల్, మిగతా నటీనటులంతా అద్భుతం చేశారని చెబుతున్నారు. ముఖ్యంగా ఎమోషన్స్ , మెలోడిని మిక్స్ చేసి నడిపించిన కథ అందరిని ఆకట్టుకుంటుందని, రాజ్ కుమార్ హీరాణీ గతసినిమాలకంటే ఇది ఇంకా బాగుంటుందని పాజిటివ్ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. మూవీ లవర్స్ ఎవరూ డంకీని మిస్ చేసుకోవద్దంటున్నారు.
#RajkumarHirani does it again”
— Muhammad Hamza (@Hamxa_85) December 21, 2023
The script is excellent, the acting is brilliant and the movie will remain among Hindi Cinema gems forever.Direction point of view I don't think so that anybody could do better than Raj Kumar Hirani. #DunkiReview #Dunki #ShahRukhKhan𓀠 pic.twitter.com/WoqVzePluv
డంకీ ఐదుగురు మిత్రుల కథ. లండన్ వెళ్లాలని కలగనే ఈ ఫైవ్ ఫ్రెండ్స్ కి ఇంగ్లీష్ రాదు. డబ్బులు లేవు. ఎలాగైనా లండన్ వెళ్లాలని నిర్ణయించుకుంటారు. సక్రమ మార్గంలో ప్రయత్నించి విసిగిపోతారు. అప్పుడు అక్రమ మార్గం ఎంచుకుంటారు. దొంగతనంగా లండన్‌కు వెళ్లాలి అనుకుంటారు. మరి వారి ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అయ్యింది? ఈ ప్రయాణంలో ఎదురైన ఇబ్బందులు ఏంటి? అసలు వాళ్ళు లండన్ కి ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు? అనేది అసలు స్టోరీ.