Home > సినిమా > తొలి‘ప్రేమ’ అలాంటిది మరి.. ‘సీఎం సీఎం’ నినాదాలతో థియేటర్ దద్దరిల్లింది

తొలి‘ప్రేమ’ అలాంటిది మరి.. ‘సీఎం సీఎం’ నినాదాలతో థియేటర్ దద్దరిల్లింది

తొలి‘ప్రేమ’ అలాంటిది మరి.. ‘సీఎం సీఎం’ నినాదాలతో థియేటర్ దద్దరిల్లింది
X

పవన్ కళ్యాన్ నటించిన కల్ట్ క్లాసిక్ మూవీ తొలిప్రేమ. ఆయన నటించిన సూపర్ హిట్ సినిమాల్లో ఇదొకటి. అయితే, రీరిలీజ్ ట్రెండ్, సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. శుక్రవారం (జూన్ 30) తొలిప్రేమ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేశారు. థియేటర్ల ముందు కొత్త సినిమాకు ఏవిధంగా.. భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, తీన్ మార్ డాన్స్ లు, హౌజ్ ఫుల్ బోర్డులు ఉంటాయో.. ఇవాళ రీరిలీజ్ అయిన తొలిప్రేమ సినిమాకు అదే వాతావరణం కనిపించింది. తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. థియేటర్ లోపల కూడా పవన్ ఫ్యాన్స్ ఏ మాత్రం తగ్గకుండా అంతే రచ్చ చేశారు. 4కె వెర్షన్ లో రిలీజ్ అయిన ఈ సినిమాతో అభిమానులు సెలబ్రెట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఓ థియేటర్లో పవన్ అభిమానులు ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ సినిమా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.





Updated : 30 Jun 2023 5:32 PM IST
Tags:    
Next Story
Share it
Top