Home > సినిమా > రవితేజకు అన్యాయం జరిగినట్టేనా..?

రవితేజకు అన్యాయం జరిగినట్టేనా..?

రవితేజకు అన్యాయం జరిగినట్టేనా..?
X

మాస్ మహరాజ్ రవితేజకు సంక్రాంతి బరిలో అన్యాయం జరిగింది. జనవరి 13న విడుదల కావాల్సిన ఆయన ఈగల్ సినిమాను బలవంతంగా వాయిదా వేయించారు అని అభిమానులంతా ఫీలయ్యారు. బట్ వారికోసం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది నిర్మాతల మండలి. ఈగల్ రిలీజ్ టైమ్ కు ఎలాంటి పోటీ లేకుండా సోలో రిలీజ్ ఉండేలా చూస్తాం అన్నారు. దీంతో ఈగల్ నిర్మాతలు కూడా హీరోను కన్విన్స్ చేసుకున్నట్టున్నారు. దీనికి ఇండస్ట్రీ బాగు కోసం అనే కలర్ కూడా వాడారు. బట్ ఇప్పుడా రంగులు వెలిసిపోతున్నాయి. రవితేజ సినిమాకు ఇచ్చిన మాట నిర్మాతల మండలి నిలబెట్టుకునేలా లేదు. దీంతో మోసపోయాం అనుకున్న నిర్మాతలు ఓ ఓపెన్ లెటర్ కూడా రాశారు. అయినా అట్నుంచి నో రెస్పాన్స్.. మరి ఈ ఇష్యూలో ఎవరి హ్యాండ్ ఎంత ఉంది..? నిజంగానే రవితేజ నిర్మాతలు మోసపోయారా..? అయితే అందుకు కారణం ఎవరు..?

ఈగల్ సినిమాను వాయిదా వేయించినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు. నిజానికి హను మాన్ ను పోస్ట్ పోన్ చేయించాలనుకున్నారు. కుదర్లేదు. దీంతో ఈగల్ పై పడ్డారు. దీనికి డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ కోసం అనే మాటలు కూడా వాడారు. పైగా అప్పటికి పెద్దగా బజ్ లేని సైంధవ్ ను మాత్రం బరిలో ఉంచారు. హడవిడీగా వచ్చిన నా సామిరంగాకు సైతం థియేటర్స్ ఉన్నాయి. కానీ వీరికంటే ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన ఈగల్ కు మాత్రం థియేటర్స్ లేవు అనే కారణంతో వాయిదా వేయించారు. సరే కొన్నిసార్లు ఇవి జరుగుతుంటాయి అనుకున్నా.. రవితేజ ఏం చిన్న హీరో కాదు. అతను కూడా కన్విన్స్ అయ్యాడంటే కారణం.. ఈ మూవీకి ఫిబ్రవరి 9న సోలో రిలీజ్ ఉండేలా చూస్తామని.. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, గిల్డ్ తో పాటు ఛాంబర్ పెద్దలు హామీ ఇవ్వడం వల్లే. కానీ ఇప్పుడు చూస్తే ఫిబ్రవరి 9న ఈగల్ తో పాటు యాత్ర2, సందీప్ కిషన్ ల ఊరిపేరు భైరవ కోన అనే సినిమాలు వస్తున్నాయి. యాత్ర2 పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే 9నే విడుదల కావాల్సి ఉన్న డిజే టిల్లు స్క్వేర్ ను వాయిదా వేయించారు. బట్ అదే డేట్ కు వస్తామని చెప్పిన సందీప్ కిషన్ సినిమాను మాత్రం లైట్ తీసుకున్నారు దిల్ రాజు అండ్ కో. అంటే ఈ సినిమాను వాళ్లు అసలు పరిగణలోకే తీసుకోలేదు అనుకోవాలి. ఇప్పుడు చూస్తే ఊరిపేరు భైరవకోన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. బిజినెస్ పరంగానూ బానే ఉందంటున్నారు. పైగా వీళ్లూ ప్యాన్ ఇండియన్ రిలీజ్ అంటున్నారు. మరోవైపు యాత్ర2 కు ఏపిలో థియేటర్స్ దొరక్కపోతే చాలా కష్టం అన్న విషయం దిల్ రాజుకూ తెలుసు. సో.. ఈగల్ కు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే యాత్ర2ను వాయిదా వేయించాలి. అలాగే ఊరిపేరు భైరవకోననూ ఆపాలి. కానీ ఇప్పటికే హను మాన్ విషయంలో దిల్ రాజుతో పాటు ఇతర సీనియర్ నిర్మాతలు అభాసుపాలయ్యారు. అసలేం జరిగింది అనేది తెలుసుకోకుండానే దిల్ రాజు విలన్ లా కనిపించాడు. మళ్లీ నెల కూడా గడవక ముందే అలాంటిదే మరోటి జరిగితే ఆయన ఇమేజ్ చాలా డ్యామేజ్ అవుతుంది. సో.. ఈగల్ కు ఇచ్చిన మాటను వదిలేసి.. సోలో రిలీజ్ అని కాకుండా కోరినన్ని థియేటర్స్ ను అడ్జెస్ట్ చేయడమే ఇప్పుడు వీళ్లు చేయగలిగేది. మరి అదైనా చేస్తారా లేక ఈగల్ నిర్మాతలను పూర్తిగా మోసం చేస్తారా అనేది చూడాలి.

Updated : 23 Jan 2024 1:41 PM IST
Tags:    
Next Story
Share it
Top